విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన పర్చూరు కుమారి నంద ను బుధవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమారి నంద ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయ విభాగంలో అధ్యాపకురాలుగా విద్యాబోధన చేస్తూనే మరొక వైపు క్రీడాకారిణి గా రాణించడం అభినందనీయం ప్రశంసించారు. హనుమాన్ పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ అభినందన కార్యక్రమం లో అటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు ఇటు ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ నాయకురాలుగా చురుగ్గా పనిచేసినటువంటి నంద భవిష్యత్తులో జరగబోయే నేషనల్ ఈవెంట్ లో కూడా ఇలాగే రాణించి మరిన్ని పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాజేశారు. దాసరి నాగభూషణరావు భవన్ లో జరిగిన ఈ అభినందన కార్యక్రమం లో విద్యార్థి నాయకులు సిపిఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ మాట్లాడుతూ నంద రాష్ట్రానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. గత నెల 22 నుండి 24 తేదీలలో తమిళనాడు రాష్ట్రంలోని సేలం జరిగినటువంటి సౌత్ ఇండియా సీనియర్ , సబ్ జూనియర్ అండ్ జూనియర్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్-2024 పోటీలలో మహిళల విభాగంలో 76 కేజీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పోటీపడి 297.5 కేజీల బరువును ఎత్తి కుమారి నంద సౌత్ ఇండియా చాంపియన్ గా నిలిచారు.
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …