విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాప్‌ావా ఏమి రుచి…ఆటోనగర్‌లోని సుభాని బిర్యానీ ఏమి రుచి… ఆటోనగర్‌లోని 100 అడుగుల రోడ్డులో ప్రారంభించిన సుభాని బిర్యానీ హోటల్ అతి తక్కువ సమయంలోనే భోజన ప్రియుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఈ సందర్భంగా గుంటూరు సుభాని బిర్యాని హోటల్ దోనెపూడి నాగదీష్ మాట్లాడుతూ రుచికరమైన మేలురకమైన బిర్యానీలను నగరవాసులకు అందిస్తున్నామని తెలిపారు. దినదినాభివృద్ధి చెందుతూ ప్రజాదరణను చూసి కొందరు గిట్టనివాళ్ళు గుంటూరు సుభాని బిర్యాని హోటల్‌పై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని అవి నమ్మవద్దని కోరారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా మా వెంట వుండి ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్ళకు నేను ఎంతో రుణపడి వుంటానని అన్నారు. అలాగే కొత్త సంవత్సరంలో మా వద్ద గల అనుభవం కలిగిన చెఫ్‌లతో మరింత క్వాలిటీతో సరిక్రొత్త రుచులుతో అనేక రకాల బిర్యానీలను అందించడానికి అతి తక్కువ ధరలతో నగరవాసులకు పసందైన అనేక రకాల బిర్యానీలను అందజేయడానికి మరింత కృషిచేస్తామన్నారు. ముఖ్యంగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కిచిడి, పాయా, మటన్ కబాబ్, పూర్తి స్వచ్ఛమైన నెయ్యితో వంటకాలను తయారుచేస్తామని తెలిపారు. అన్ని రకాలైన ఫంక్షన్లుకు ఆర్డర్లు పై తయారుచేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. కస్టమర్ల కోరికపై త్వరలో నగర వాసులకు హోమ్ పార్సిల్ వెసులుబాటును కల్పించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. నగర ప్రజలందరికీ మా కష్టమర్ దేవుళ్ళకి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …