-విజయవంతంగా ముగిసిన భవాని దీక్ష విరమణలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ఆదేశాల మేరకు భవాని దీక్షల విరమణ కొరకు విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఏర్పాట్లను విఎంసి సిబ్బంది సక్రమంగా చేస్తూ పనులు నిర్విరామంగా నిర్వహిస్తూ భవాని దీక్ష విరమణలు విజయవంతం చేసినందుకు గురువారం నాడు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వి ఎం సి సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీస్, ఎండోమెంట్స్, రెవెన్యూ, హెల్త్, ఫైర్, ఏపీసీపీడీసీఎల్, ఐసిడిఎస్ తదితర వివిధ శాఖల సౌజన్యంతో జరిగిన భవాని దీక్ష విరమణలు విజయవంతంగా జరిగిందని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ వారి డ్రోన్లతో ప్రత్యేకంగా పారిశుధ్య నిర్వహణన చేశారని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుండి అధికారులు పర్యవేక్షించి పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం గమనించిన అధికారులు వెంటనే సిబ్బందిని వైర్లెస్ సెట్ లో అప్రమత్తం చేసి పారిశుధ్య నిర్వహణ లో ఎటువంటి లోపం లేకుండా చేశారని తెలిపారు.
ఇప్పటివరకు దాదాపు పది లక్షల వాటర్ బాటిల్ లను 6,50,000 వాటర్ ప్యాకెట్లను భవాని భక్తులకు పంపిణీ చేశారని, 200 తాత్కాలిక మరుగుదొడ్లను 15 ప్రాంతాలలో అమర్చి నిత్యం పరిశుభ్రపరుస్తూ, వాడుక నీటిలోనూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పాయింట్ లలో గల నివేదికను తీసుకుంటూ నిత్యం టాంకర్లతో డ్రమ్ములను నింపి, 300 ఇంజనీరింగ్ సిబ్బంది విధుల్లో నిమగ్నమై నిత్యం భవాని భక్తులకు త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా 24 గంటలు పని చేశారని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ కోసం వచ్చిన 1400 పారిశుధ్య కార్మికులు నిత్యం పనిచేస్తూ అహర్నిశలు శ్రమించారని, వారిని 104 సిబ్బంది పర్యవేక్షించారని , కన్వేయర్ బెల్ట్ ద్వారా ఎప్పటికప్పుడు భవానీ దుస్తులను తీసివేయటమే కాకుండా వాటిని ఎక్సల్ ప్లాంట్ కు తరలించాలని. భవాని దీక్ష విరమణ వస్త్రాలు వ్యర్థాలను సేకరించాలని, పొడి చెత్త 750 టన్నుల వ్యర్ధాలను సేకరించారని, వాటిని ఎప్పటికప్పుడు ఎక్సెల్ ప్లాంట్ కి తరలించాలని తెలిపారు. భవాని భక్తుల కోసం ఉచితంగా ఆరు సామాన్లు మరియు చెప్పులు భద్రపరచు క్లోక్ రూములను ఏర్పాటు చేయడమే కాకుండా భక్తులకు తెలియపరచుటకు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం మైకుల ద్వారా ఉచిత క్లోక్ రూమ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ప్రతి అరగంటకి ప్రచారం చేసి భక్తులకు తెలియపరిచారని తెలిపారు. భవాని దీక్ష విరమణ కోసం వచ్చే భక్తులకు దోమల ద్వారా జంతువుల ద్వారా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు వెటర్నరీ, మలేరియా విభాగం నిరంతరం పర్యవేక్షిస్తూ ఎమ్ ఎల్ ఆయిల్ స్ప్రే, ఫాగింగ్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ భవాని భక్తులు ప్రశాంతంగా వారి దీక్ష విరమణ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. వాస్తవంగా భవానీ దీక్ష విరమణలు డిసెంబర్ 21 నుండి 25 వరకు ఉన్నప్పటికీ ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత కూడా నగరపాలక సంస్థ విధులు నిర్వహిస్తూ దీక్ష విరమణలు విజయవంతంగా చేసినందుకు విజయవాడ నగరపాలక సిబ్బంది అందర్నీ కమిషనర్ అభినందించారు.