-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ మరియు ఎంఎల్ఏ సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ నందు ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల నిర్వహణపై ఎంఎల్ఏ సూళ్లూరుపేట తో కలిసి సంబంధిత అటవీ, పర్యాటక శాఖ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం మన జిల్లాలోని సూళ్లూరుపేట నియోజక వర్గంలో ఉంటూ పలువురు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు. 2020 సం. తర్వాత జరుపుకుంటున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ను గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారని అన్నారు. ఎంఎల్ఏ గారి సూచనలు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల భాగ స్వామ్యంతో ఘనంగా పండుగ వాతావరణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు ఎస్వీ జూ పార్కు క్యూరేటర్ సెల్వం, సూళ్లూరుపేట డిఎఫ్ఓ, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డా.రమణ ప్రసాద్, జిల్లా పర్యాటకశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.