గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలని, గ్యాంగ్ వర్క్ ల ద్వారా డ్రైన్లు, సమస్యాత్మక ప్రాంతాలు శుభ్రం చేయడంపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ ఏటి అగ్రహారం, ఎన్జీఓ కాలని, సాయి నగర్, నల్లపాడు, బుడంపాడు, శ్రీనివాసరావుతోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను, ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా చేపట్టే పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, డ్రైన్లను శుభ్రం చేయడం లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, డ్రైన్లను తప్పనిసరిగా మధ్యాహ్నం సమయంలో గ్యాంగ్ వర్క్ ద్వారా శుభ్రం చేయాలన్నారు. శానిటేషన్ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో ఇంటింటి చెత్త సేకరణ, మెయిన్ రోడ్ల స్వీపింగ్, కమర్షియల్ సంస్థలు డ్రైన్లలో వ్యర్ధాలు వేయకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నూతనంగా నిర్మాణం చేసే సిసి రోడ్లకు బరంస్ లేకుండా చేపట్టవద్దని, నిర్మాణ పనుల అనంతరం డెబ్రిస్ తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్జీఓ కాలనీ పార్క్ ని పరిశీలించి, ఓపెన్ జిమ్ పరికరాలు మరమత్తు గురవ్వడం ప్రత్యక్షంగా పరిశీలించి, తక్షణం మరమత్తు చేయాలని, పెండింగ్ పనులపై పార్క్ వాకర్స్ కమిటితో చర్చించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని డిఈఈని ఆదేశించారు. బుడంపాడులోని హిందూ, క్రిస్టియన్ శ్మశానవాటికలను పరిశీలించి, మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా నీటి వసతి వెంటనే కల్పించాలన్నారు. అలాగే మెయిన్ రోడ్లపై అవసరాల మేరకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, వాటికి తప్పనిసరిగా ఇండికేటర్స్ ని దూరం నుండే కనిపించేలా పెట్టాలని ఈఈలను ఆదేశించారు.
అనంతరం బుడంపాడు మెయిన్ రోడ్ లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను పరిశీలించిన అనంతరం కమిషనర్ గారు మాట్లాడుతూ భవన నిర్మాణ సమయంలోనే ర్యాంప్ లు రోడ్ల మీదకు నిర్మాణం చేయకుండా నియంత్రించాలని ప్లానింగ్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. అలాగే జిఎంసి నుండి తీసుకున్న ఆమోదిత ప్లాన్ మేరకు నిర్మాణం జరుగుతన్నదీ లేనిదీ కూడా పర్యవేక్షణ చేయాలన్నారు.
పర్యటనలో డిఈఈలు మధుసూదన్, సతీష్, ఏసిపి వెంకటేశ్వరరావు, ఆర్.ఓ.లు రెహ్మాన్, రవి కిరణ్ రెడ్డి, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …