గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరమని, అటువంటి కనెక్షన్ల తొలగింపుకు ప్రత్యేక బృందాలతో డ్రైవ్ చేపడుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కుళాయి కనెక్షన్ కు దరఖాస్తు చేసిన నిర్దేశిత సమయంలోనే కనెక్షన్ అందించడం జరుగుతుందన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా కార్యదర్శులు ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లకు సంబందించి ఇంటింటి సర్వే చేస్తున్నారని, సర్వేలో పలు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా షుమారు 6 వందలు కుళాయి, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం గమనించి వాటి తొలగింపుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు చట్టరీత్యా నేరమని, అటువంటి వారు వారం రోజుల్లో స్వచ్చందంగా స్థానిక వార్డ్ సచివాలయంలో ఎమినిటి కార్యదర్శిని సంప్రదించి, తగిన డాక్యుమెంట్స్ అందించి ట్యాప్ లేదా డ్రైనేజి కనెక్షన్ కోసం తగిన డాక్యుమెంట్స్ తో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Tags guntur
Check Also
పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలని, గ్యాంగ్ వర్క్ …