-పెన్సన్ భిక్ష కాదు..ఇది మా హక్కు
-సి పి ఎస్/ జి పి ఎస్ లు వద్దు…పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి….
-బొప్పరాజు & పలిశెట్టి దామోదర్ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తూ రిటైర్ అయి పెన్షన్ పొందుతున్న సీనియర్ ఉద్యోగులందరికీ మంగళవారం పెన్షనర్సు డే సందర్బంగా ఏపి జేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున “పెన్షనర్సు డే” శుభాకాంక్షలు తెలియజేస్తూ….ఉద్యోగి రిటైర్ అయిన రోజునే ప్రభుత్వం పెన్సనర్లుకు చెల్లించాల్సి పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని చెల్లించేలా ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్ కు బకాయిపడ్డ డబ్బులు అనగా డి ఎ /పీ ఆర్సి అరియర్స్, గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవు తదితర బకాయిలు తక్షణమే రిటైర్డ్ ఎంప్లాయీస్కు మొదటి ప్రాధాన్యత ఇస్తూ తక్షణమే చెల్లించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న షుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లను (సినియర్ సిటిజన్సును) ఆదుకోవాలని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు మరియు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్ట్రీ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఐ.లక్ష్మిన్నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. అనేక మంది సీనియర్ పెన్షనర్లు కనీసం వారికి రావాల్సిన లక్షలాది రూపాయలు బకాయిలు తీసుకోకుండానే చనిపోతున్నారని , ఇది చాలా బాధాకరం అని, పెన్షనర్లూ అందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనీ తెలిపారు. అలాగే పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని, అది ప్రభుత్వాల భిక్ష కాదని గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపిందని, 35/40 సంవత్సరాల పాటు సేవలందించిన ఉద్యోగికి పెన్షన్ చెల్లించడం భారం అనుకోకుండా….భాధ్యత అనుకోవాలని తెలిపారు. మంగళవారం పెన్సనర్సు డే సందర్బంగా గన్నవరం మరియు విజయవాడలో జరిగిన సమావేశాలలో రిటైర్ అయిన 75 మరియు 80 సంవత్సరాల పైబడిన సినియర్ రిటైర్డ్ ఉద్యోగులను చైర్మన్ బొప్పరాజు గారి ఆద్వర్యంలో సత్కరించారు.
ఈసందర్బంగా బొప్పరాజు మాట్యాడుతూ రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షలు మంది పెన్షనర్లు హక్కులు, డిమాండ్లు సాదన కోసం నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తూ ఏపిజేఏసి అమరారతి రాష్ట్రకమిటీ తో పాటు జెఏసికీ అనుబందంగా ఉన్న ఏపి గవర్నమెంటు రిటైర్డు ఎంప్లాయీస్ అసోషియేషన్ పక్షాన పెన్షనర్లకూ రావాల్సిన బకాయిల చెల్లింపులు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో పాత స్లాబ్సు తిరిగి పునరుద్ధరించడం, వితంతువులకు, విడాకులుపొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం తదితర రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ విషయాల్లో గౌః ముఖ్యమంత్రిగారికి లిఖిత పూర్వకంగా లేఖలు కూడా ఇచ్చామని తెలిపారు. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు (ఇ.హెచ్.యస్) ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నామని ఈ హెల్తు స్కీమ్ ద్వారా మెరుగైన పద్దతులు వస్తే అధికశాతం రిటైర్ అయిన వృద్దులకు ప్రయోజనకరంగా ఉంటుందని బొప్పరాజు తెలిపారు. ఈ సమావేశంలో అధికసంఖ్యలో రిటైర్డు ఉద్యోగులు పాల్గోన్నారు.