గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంకు సంబందించిన క్షేత్ర స్థాయి పనులను ఆర్&బి, నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఆర్&బి, జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న శంకర్ విలాస్ ఆర్ఓబి కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినందున నిర్మాణం కోసం రోడ్ విస్తరణ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే అరండల్ పేట, బ్రాడిపేట వైపు ప్రభావిత భవనాల యజమానులతో, ఏఈఎల్సి చర్చి, ఆర్సిఎం చర్చి ప్రతినిధులుతో సమావేశమయ్యామని, వారి నుండి సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఆర్ఓబి నిర్మాణం, సర్వీస్ రోడ్ మార్కింగ్ వంటి పనులను వేగంగా చేపట్టాలన్నారు. ఆర్ఓబి నిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీస్, రైల్వే అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే జాయింట్ మీటింగ్ లు ఏర్పాటు చేయాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, ఆర్&బి ఎస్ఈ ఆర్.శ్రీనివాసమూర్తి, ఈఈ సి.విశ్వనాధరెడ్డి, డిఈఈ చిన్నయ్య, ఏసిపి రెహ్మాన్ పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం
-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …