-ధీక్షల విరమణకు ఏర్పాట్లు ముమ్మరం…
-6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా…
-జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మిశ.
-పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మండలం రోజుల పాటు అకుంటిత భక్తితో పూజలాచరించి అమ్మవారికి ఇరిముడి సమర్పించేందుకు తరలివచ్చే లక్షాలాధి భవానీ ధీక్షాదారులకు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో భవానీ దీక్షలు విరమణ చేసుకుని త్వరితగతిన అమ్మవారి ధర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ తెలిపారు. భవాని ధీక్షల విరమణ కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను బుధవారం జిల్లా కలెక్టర్ లక్ష్మిశ నగరపోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబులు, దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, నగరపాలక సంస్థ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మత్స్యశాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధిలతో జిల్లా కలెక్టర్ లక్ష్మిశ మాట్లాడుతూ ఈనెల 21 నుండి 25 వరకు భవానీ భక్తులు అమ్మవారికి ఇరిముడులు సమర్పించి దీక్షాలు విరమించనున్నారన్నారు. రోజుకు సుమారు లక్ష మంది చొప్పున 6 లక్షల మంది భవానీలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామన్నారు. లక్ష్యాలాధిగా భవానీ భక్తులు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. దసరా ఉత్సవాలు విజయవంతం చేసిన తరహాలో భవానీ దీక్షా విరమణల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యూ మార్గంలో వాటర్ ఫ్రూప్ షామియానాలు, క్వాయర్ మ్యాట్లు, తాగునీరు సరఫరా వంటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా భక్తులకు నిరంతరం సూచనలు, సమాచారం అందించడం జరుగుతుందన్నారు. అవసరమైనన్ని తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి నిరంతరం పారిశుద్ద్య పనులు చేపట్టేలా మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. ఆలయం చుట్టుపక్కల మాత్రమే కాకుండా నగరానికి వచ్చే వివిధ రహదారుల వెంబడి వైద్య శిబిరాలతో పాటు విశ్రాంతి ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్నానా ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించి ఇరుముడులు సమర్పించేందుకు ఏర్పాట్లు చేశామని భక్తుల సౌకర్యాద్దం మూడు హోమ గుండం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులకు అవసరమైన లడ్డూ ప్రసాదాలను సిద్దంగా ఉంచాలని దేవాదాయ అధికారులను ఆదేశించామన్నారు. ఘాట్ల వద్ద స్నానం అచారించి మాల విరమణ అనంతరం ఎర్ర వస్త్రాలు నీటిలో వదిలే ప్రాంతంలో పారిశుద్దం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నగర పోలీస్ కమీషనర్ రాజ శేఖర్ బాబు మాట్లాడుతూ భవానీ ధీక్షా విరమణ భక్తుల కొరకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. క్యూ లైన్‌ల ఏర్పాట్లు వెయింటిగ్ హాళ్ళు, పార్కింగ్ స్థాలాలు, లడ్డూప్రసాదం, అన్నప్రసాదాల పంపిణీ వంటి వివరాలు యాప్ ద్వారా భక్తులకు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. కట్టుదిట్టుమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అన్ని ముఖ్య ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన్నట్లు వివరించారు.
నగర పాలక సంస్థ కమీషనర్ హెచ్. యం. ధ్యాన చంద్ర మట్లాడుతూ పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రత్యేక టీమ్‌లను సిద్ధం చేసి.. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యానికి చర్యలు తీసుకునేలా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాట్లు తెలిపారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ, స్వచ్చంద సంస్థలు, వాలంటీర్ల సేవాలను వినియోగించుకుని కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆలయ ఈవో కేఎస్ రామరావు మట్లాడుతూ దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్షా విరమణలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూడు హోమ గుండాలు ఏర్పాటు చేయనున్నామని.. అదే విధంగా సీతమ్మవారి పాదాలు, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ వద్ద మొత్తం 800 వరకు షవర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిరచారు. గత అనభవాలను దృష్టిలో ఉంచుకొని లడ్డూ ప్రసాదానికి కొరత లేకుండా ఈసారి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామరావు వెల్లడిరచారు. ఆధ్యాత్మిక వాతావరణంలో దీక్షా విరమణలు జరిగేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కార్యమక్రమం విజయవంతానికి కృషి చేస్తున్నామన్నారు.
సమావేశంలో విజయవాడ ఆర్‌డివో చైతన్య, ఆలయ ఈఈలు కోటేశ్వరరావు, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, నగరపాలక సంస్థ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మత్స్యశాఖ వియంసి అధికారులు పాల్గొన్నారు.