విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫీవర్ సర్వ్, ఇళ్ల నిర్మాణం విషయాల్లో పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజయవాడ సబ్ కలెక్టరు జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. మంగళవారం విజయవాడ వారు డివిజన్ లోని మండల స్థాయి అధికారులు – తహసిల్దారులు, ఎంపిడిఓ లు, హౌసింగ్ ఏఈ లు, వ్యవసాయ శాఖాదికారులు, మెడికల్ ఆఫీసర్లతో దృశ్య శ్ర వణ విధానము (విసి) ద్వారా కోవిడ్-19 ఫీవర్ సర్వే, వాక్సినేషన్, నిర్ధారణ పరీక్షలు, ఇండ్ల స్థలములు, హౌసింగ్ , లే అవుటు ల అభివృద్ధి, డిజిటల్ లైబ్రరీ, అమూల్ తదితరులకు భూమి లభ్యత , భూసేకరణ , స్పందన అర్జీలు సత్వర పరిష్కారము తదితర అంశములపై సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సమీక్ష జరిపి అన్ని విషయములలో తగు పురోగతి నిమిత్తం ఆదేశములు, మార్గదర్శకములు, మరియు మండల లెవెల్ అధికారులచే లేవనెత్తిన అనేక సందేహాలను నివృత్తి చేశారు. సదరు సమావేశములో సంబంధిత శాఖ ల డివిజిన్ లెవెల్ అధికారులు కూడా సబ్ కలెక్టరు వారి కార్యాలయంలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …