రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబరు 30 న రాజమహేంద్రవరం లో రాష్ట్ర మత్స్య శాఖ సహకారంతో నాబార్డు అధ్వర్యంలో రొయ్యల ఉభయ గోదావరీ జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు నాబార్డ్ ఏ జి ఎమ్ ,- వై ఎస్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రాజమండ్రిలోని లా హాస్పిన్ హోటల్‌లో 30 డిసెంబర్ 2024 సోమవారం ఉదయం 10.00 గంటలకు రొయ్యల పెంపకంపై ‘అవగాహన కార్యక్రమాన్ని’ నిర్వహిస్తోంది. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాబార్డ్ సి జి ఎమ్ – ఎమ్ ఆర్ గోపాల్, మత్స్య శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయ జాయింట్ డైరెక్టర్ (ఆక్వా) లాల్ మొహమ్మద్, ఇతర అధికారులు, రైతులు పాల్గొననున్నారు. ఈ ప్రాంత బ్యాంకర్లు, రైతులు, ప్రాసెసర్‌లు, ఎగుమతిదారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు టెక్నాలజీ సంస్థలు. భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు, AP ప్రభుత్వం (ఫిషరీస్ కమీషనర్ ఈట్), NFDB, CIBA, CMFRI, MPEDA మరియు సీనియర్ బ్యాంకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …
Prajavartha Online Telugu News