గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
టేబుల్ టెన్నిస్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన హాసిని చదువులోను ముందుంటూ ఆదర్శంగా నిలుస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ లో శిక్షణ పొంది రాష్ట్ర స్థాయిలో అండర్-19, అండర్-17, ఉమెన్స్ విభాగాల్లో ప్రతిభచాటి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన పి.హాసినిని సోమవారం కమిషనర్ తమ క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడలను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని, తల్లిదండ్రులు చిన్నారులను క్రీడల పట్ల ప్రోత్సహించాలన్నారు. క్రీడల వలన చిన్నారుల్లో మానసిక, శారీరక ధారుడ్యంతోపాటు చదువులోను ముందుంటారని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి హాసిని రుజువు చేసిందన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ పొందిన హాసిని ఈ నెల 20 నుండి 22 వరకు కాకినాడలో జరిగిన ఏపి స్టేట్ చాంపియన్షిప్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో అండర్-19 విభాగంలో బంగారు, అండర్-17 విభాగంలో రజత, ఉమెన్స్ విభాగంలో కాంస్య పతకాలు సాధించి, గుంటూరు నగర ఖ్యాతిని చాటిందన్నారు. రాష్ట్ర పోటీల్లో ప్రతిభ చూపిన హాసిని జనవరి 3 నుండి వదోదరలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ అండ్ యూత్ నేషనల్ చాంపియన్షిప్ లో పాల్గొనున్నదని, ఆ పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభతో పతకాలు సాధిస్తుందని ఆకాంక్షించారు. హాసిని తనకు ఇష్టమైన టేబుల్ టెన్నిస్ తో పాటు, తన చదువులో కూడా విశేష ప్రతిభ చాటుతుందన్నారు. త్వరలో ఎన్టీఆర్ స్టేడియం క్రీడల కేంద్రంగా నిలిచేలా ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. హాసినిని ప్రోత్సహించిన తండ్రి కోటేశ్వరరావు, శిక్షణ అందించిన కోచ్ సురేంద్ర, ఆర్ధిక ప్రోత్సాహంతో అండగా నిలిచిన గుంటూరు జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్వీ.గురుదత్ లకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు.
Tags guntur
Check Also
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …