Breaking News

చిలకల మాడంగి కొండపై గిరిజనుల సమస్యలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బాగుజోల, సిరివర మధ్య తారు రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన అనంతరం గిరిశిఖర గ్రామాల వైపు సుమారు కిలోమీటరు దూరం పవన్ కళ్యాణ్  కాలి నడకన చిలకల మాడంగి కొండపైకి ఎక్కారు. నూతనంగా రహదారి నిర్మించనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూరపాడు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తే ఇబ్బందులు లేకుండా తాము పంటలు పండంచుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గిరిజన రైతులు  పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సూరపాడు రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించి మధ్యలో నిలిపివేసినట్టు చెప్పారు. ఈ విషయంపై జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యులు మాట్లాడారు. కొండ ఎక్కుతూ అక్కడి నుంచి వ్యూ పాయింట్ తిలకించారు.

గంజాయి నిర్మూలనపై పోస్టర్ ఆవిష్కరణ
కార్యక్రమంలో భాగంగా సాలూరు రేంజ్ అటవీ అధికారులు గంజాయి సాగు నిర్మూలన, రవాణాను నిలువరించడంపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  ఆవిష్కరించారు. గంజాయి నిర్మూలనకు అటవీశాఖ అధికారులు నిబద్దతతో పని చేయాలని సూచించారు.

థింసా నృత్యం చేసిన ఉపముఖ్యమంత్రివర్యులు
చిలకల మాడంగి లో పవన్ కళ్యాణ్ కొండ ఎక్కుతూ ఉండగా గిరిపుత్రులు డప్పులు, సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆయనకి స్వాగతం పలుకుతూ ఎదురొచ్చారు. కొండ వాలు వద్ద సిరివరకు చెందిన గిరిజన మహిళలతో కలసి వారి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. గిరిజన మహిళలతో కలసి పదం కలుపుతూ వారిని ఉత్పాహ పరిచారు.

బాగుజోల బేస్ క్యాంప్ వద్ద మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్ 
తిరుగు ప్రయాణంలో బాగుజోల అటవీశాఖ బేస్ క్యాంప్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంపా స్కీమ్ లో భాగంగా అటవీ అధికారులతో కలసి మొక్కలు నాటారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏఏ జాతుల మొక్కలు పెంచుతున్నారు… సాలూరు రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలు తదితర అంశాలపై ఆరా తీశారు.

బ్రహ్మరథం పట్టిన గిరిపుత్రులు
పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంత పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జిల్లా ప్రజలు, గిరిపుత్రులు అడుగుడుగునా ఘన స్వాగతం పలికారు. గజపతినగరం, రామభద్రపురం, సాలూరు, మామిడిపల్లి, మార్కొండపుట్, ఎర్రసామంతువలస తదితర ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నీరాజనాలు పలికారు. దారిపొడుగునా జనసేన నినాదాలు చేస్తూ.. పవన్ కళ్యాణ్ కి జేజేలు పలుకుతూ.. పూల వర్షం కురిపించారు. గిరిజన మహిళలు తమ ప్రాంతంలో లభించే పూలతో దండల తయారుచేసి పవన్ కళ్యాణ్ కి వేసేందుకు బారులు తీరారు. హారతులతో కొంత మంది మహిళలు ఎదురురాగా, మరికొంత మంది గిరిజన సంప్రదాయాలతో స్వాగతం పలికేందుకు ఆసక్తి చూపారు. జోరువానలోనూ తిరుగు ప్రయాణంలో సైతం జనం మొత్తం రోడ్ల మీద గొడుగులతో బారులు తీరారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు.

Check Also

కరుణానిధి స్ఫూరితోనే బీసీల *మనుగడ, తమిళనాడు తరహా అభివృద్ధి

-బీఎస్పీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్రరావు -“సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలికి ఎన్ఠీఆర్ మనవడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *