పుత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ మంత్రి. ఆర్.కె.రోజా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గేట్ పుత్తూరు నందు పుత్తూరు ముస్లిం మైనారిటీ లతో కలిసి గంధపు ఉత్సవ కలశాలను ఊరేగింపులో తీసుకువెళ్లి నాగూరు ఖాదర్ వలి గంధపు మహోత్సవంలో దర్గా నందు ముస్లిం మైనారిటీల ద్వారా పూజల నిర్వహించి ఉత్సవాలలో శనివారం పాల్గొన్నారు. గేట్ పుత్తూరు స్థానిక ముస్లిం నాయకులు, ప్రజలు అంగరంగ వైభవంగా బ్యాండు మేళాలు, బాణా సంచాలతో మరియు గజమాలతో మాజీ మంత్రి కి ఘన స్వాగతం పలికారు. ఆర్.కె.రోజా గేట్ పుత్తూరు దర్గా నందు ప్రతి సంవత్సరము నాగూరు ఖాదర్ వలి దర్గాలో ఇస్లాం సంప్రదాయ పద్దతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మహీన్, మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్ శంకర్, జయప్రకాశ్, మసీదు పెద్దలు సాహిబ్ ఇలియాస్ యూసఫ్ సాహీబ్ ఖాదర్ సాహెబ్ మరియు ముస్లిం సోదరులు, మునిసిపల్ వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష
-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యాక్రమాల అమలు చైర్మన్, కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా …