గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ కుల గణన జాబితాలో సవరణలకు మంగళవారం (31వతేదీ) ఆఖరి రోజు అని గుంటూరు నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి అయిన కుల గణన జాబితాలను ఈ నెల 26న నగరంలోని 206 వార్డ్ సచివాలయాల నోటీసు బోర్డ్ ల్లో సందర్శనార్ధం ప్రకటీంచామని తెలిపారు. నగర ప్రజలు సర్వే రిపోర్ట్ లోని తమ వివరాలు సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. పేర్లు లేదా సబ్ కేటగిరి వివరాలు తప్పుగా ఉన్నా లేదా ఏమైనా అభ్యంతరాలు ఉన్నా మంగళవారం (31వ తేదీ) సాయంత్రం 5 గంటలలోపు స్థానిక సచివాలయంలో అడ్మిన్ కార్యదర్శి, విఆర్ఓలకు లిఖిత పూర్వకంగా అర్జీలు అందించవచ్చని తెలిపారు. ఆర్జీలను క్షేత్ర స్థాయిలో విచారించి, విచారణ మేరకు తుది జాబితాలో నమోదు చేస్తామని పేర్కొన్నారు.
Tags guntur
Check Also
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …