– పన్నుల వసూళ్ల లో నిధులను దుర్వినియోగం చేసిన పొరుగు సేవలు సిబ్బంది విధులు నుంచి తొలగింపు , పంచాయతి సెక్రటరీల సస్పెన్షన్
– కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, నిధులను దుర్వినియోగం చేసిన వారి విషయంలో ఉపేక్షించె పరిస్థితి ఉండదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్ నిర్వహణ , విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవరించడం , పన్నుల వసూళ్ల పరంగా పనితీరు నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం , తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ తదితర అంశాల ఆధారంగా సంబంధిత సిబ్బంది పై చర్యలకు ఉపక్రమించడం జరిగిందని తెలిపారు. ప్రజలకి జవాబుదారీతనం కలిగి పౌర సేవలు అందించడం విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బిక్కవోలు మండలం తోస్సిపూడి పంచాయతీ సెక్రటరీ డి. విజయ రాజు విధుల్లో బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిన తీరు పై స్ధానిక అనపర్తి శాసనసభ్యులు ఫిర్యాదు నేపథ్యంలో విచారణ అనంతరం విధులు నుంచి సస్పెండ్ చెయ్యడం జరిగింది. సీతానగరం మండలం రఘుదేవపురం (ప్రస్తుతం హుకుంపేట) పంచాయతీ కార్యదర్శి కె ఎస్ రాజశేఖర్ నిధుల దుర్వినియోగం పై సస్పెన్షన్ చేస్తూ, వసూలు చేసిన పన్నుల మొత్తంలో దుర్వినియోగం చేయడంపై పొరుగు సేవలు సిబ్బంది టి. లాల్ కుమార్ ను విధులను తొలగిస్తూ, పంచాయతి బిల్ కలెక్టర్ వై. అర్జునుడు ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా కడియం మండలం దుళ్ళ (ప్రస్తుతం చిన కొండేపూడి) పంచాయతి సెక్రటరీ బి. సరోజ రాణి విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్ చెయ్యడం జరిగింది. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఈ ఎన్ రామలక్ష్మి తప్పుడు తేదీతో జన్మ దిన ధృవపత్రం జారీ చేసిన విషయములో క్రిమినల్ కేసు నమోదు చెయ్యడం జరిగిందనీ, విధులు నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.