రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జేగురుపాడు శ్రీరామదాసు పేపరు బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ నల్లమిల్లి లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ కి అందచేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి, ప్రతి ఒక్కరు తమ వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలలో, వితరణ అందించే ప్రయత్నం లో స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద మానవతా విలువలకు కట్టుబడి ముందుకు రావాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగిందన్నారు. అదే క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో దివ్యాంగులకి చేయూత నిస్తున్న వివిధ సంస్థలకు, వసతి గృహాలలో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా దుప్పట్లు, పరుపులు, తలగడలు, బెడ్ మ్యాట్స్ అందజేసేందుకు తమ వంతు సహాయంగా లక్ష రూపాయల చెక్కును చేసిన శ్రీనివాస్ ను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామదాసు పేపరు బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ నల్లమిల్లి, జిల్లా ప్రణాళిక అధికారి ఎల్ అప్పల కొండ పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …