మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మనుగా కోడూరు డీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మనుగా నిడుమోలు డీసీ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం కలెక్టరేటులో ప్రాజెక్టు కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కృష్ణాడెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మనుగా కోడూరు డీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మనుగా నిడుమోలు డీసీ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. బాగా పనిచేసి కృష్ణా డెల్టాలో రైతాంగానికి సేవలందించాలని సూచించారు. తొలుత అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు వీరిని అభినందించి సత్కరించారు.
Tags machilipatnam
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …