రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి లు కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులు తో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, జాతీయ రహదారులు, సాక్షం అంగన్వాడీ కేంద్రాలు, ఎన్ పి సీ ఐ, ఎమ్ ఎస్ ఎమ్ ఈ సర్వే, జి ఎస్ డబ్ల్యూ ఎస్ – హౌస్ హోల్డ్ సర్వే, జే జే ఎమ్ , రెవెన్యు సదస్సులు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇళ్ళ నిర్మాణం కింద జిల్లాకి కేటాయించిన 4384 ఇళ్ళ నిర్మాణం పనుల్లో 3817 ఇళ్ళ నిర్మాణం పూర్తి చెయ్యడం జరిగిందని తెలిపారు. మిగిలిన 1232 ఇళ్లలో స్టేజ్ కన్వర్షన్ కింద 341 పురోగతి ఉన్నట్లు తెలిపారు. మండల పరిధిలో ఉన్న ప్రతి ఒక్క లే అవుట్ నీ ఎంపిడివో వ్యక్తి గతంగా సందర్శించి ఇళ్ళ నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. సచివాలయం సిబ్బంది నీ ఇందుకోసం మ్యాపింగ్ చేసి, లబ్దిదారుల ద్వారా నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తెలుసుకోవాలన్నారు. వీక్లీ టార్గెట్స్ మేరకు ప్రతి ఇంటి నిర్మాణం చేపట్టడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. శక్షం కింద అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఇంటి పన్నుల వసూళ్ల పరంగా 3,59,640 ఇళ్లకు గాను 3,59,542 ఇళ్ళ ఎసెస్మెంట్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా జిల్లా లో పన్నుల వసూళ్ల పరంగా 85.56 కోట్ల కు గాను రూ.84 కోట్ల 92 లక్షలు పూర్తి చెయ్యడం జరిగిందని, ఇంకా కోటి 64 లక్షలు రూపాయలు వసూళ్లు చెయ్యాల్సి ఉందన్నారు. ఎంపిడివో లు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రెవిన్యూ సదస్సు లలో అర్జీలను ఎప్పటికప్పుడు పీజీ ఆర్ ఎస్ నమోదు చేసి, ఎస్ వో పి మేరకు పరిష్కారం చేయాలన్నారు. ఎమ్ ఎస్ ఎమ్ ఈ కి చెందిన సర్వే వేగవంతం చేయాలని, వాటి వివరాలు అప్లోడ్ చెయ్యాలని పేర్కొన్నారు. జాతీయ రహదారులు కి చెందిన 25 ప్రాజెక్ట్ లపై ప్రగతి పై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు డిఆర్ఓ టి సీతారామ మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు
Tags Rājamahēndravaraṁ
Check Also
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …