మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శనివారం కలెక్టరేట్ సందర్శించి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించి, సీసీ కెమెరాలు సర్వేలెన్స్ రూమ్ పరిశీలించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్లు ఓపెన్ చేయించి భద్రపరిచిన ఈవీఎంలు పరిశీలించారు. గోడౌన్ లో భద్రపరిచిన ఈవీఎంలు వాటి వివరాలు జిల్లా కలెక్టర్ ఎన్నికల సీఈవోకు వివరించారు. తనిఖీ సందర్భంగా సంబంధిత రిజిస్టర్లలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సంతకాలు చేశారు. డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, వివిధ రాజకీయ పార్టీలు బిజెపి, టిడిపి, కాంగ్రెస్, సిపిఎం, బీఎస్పీ పార్టీల ప్రతినిధులు పంతం గజేంద్ర, బత్తిన దాసు, కోక ఫణిభూషణ్, కొడాలి శర్మ, బాలాజీ కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …