Breaking News

మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను చైతన్యపరచి డ్రగ్స్ వాడకాన్ని నిరోధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావుతో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల వద్ద మాదకద్రవ్యాల దుర్వినియోగంపై గట్టి నిఘా ఉంచాలన్నారు. విద్యార్థులు ఎవరైనా మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే వారి తల్లిదండ్రులతో మాట్లాడి మాదకద్రవ్యాల విక్రయ మూలాలను గుర్తించేందుకు గట్టి ప్రయత్నం చేయాలన్నారు. దీనికోసం ముందుగా ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి అట్టి విద్యార్థులను గుర్తించాలని సూచించారు. అదేవిధంగా గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులతో మాట్లాడి ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిస్తే గనక తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు మాదకద్రవ్యాల దుర్వినియోగంపై విస్తృత అవగాహన పరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

మాదకద్రవ్యాల గుర్తింపు (డ్రగ్ డిటెక్షన్) కోసం సంబంధిత పరికరాలు, నార్కోటిక్ టెస్ట్ కిట్లు, డ్రగ్స్ ను స్కానింగ్ చేసే యంత్రాలు, డ్రగ్ స్నిఫింగ్ డ్రోన్స్ వంటి పరికరాలను కొనుగోలు చేయడం ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టగలమని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు కలెక్టర్ ను కోరారు. మచిలీపట్నంలో ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇప్పటికే మాదకద్రవ్యాలను సేవించి చికిత్స పొందుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో గుడివాడ ఆర్డిఓ జి సుబ్రహ్మణ్యం, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి, వ్యవసాయ, సాంఘిక సంక్షేమం తదితర శాఖలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *