-గ్రామీణ ప్రాంత రోడ్లు అభివృద్ధికి రూ 25 కోట్లు మంజూరు
-రూ. మూడు కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం
-రూ 20 లక్షలు చినారావూరు పార్క్ ను మరమ్మత్తులు
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
-క్రీడలను ప్రోత్సహిస్తూ తెనాలి పట్టణంలో సువిశాల క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నాం
-రానున్న సంక్రాంతి లోపు పలు అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం
-పట్టణ అభివృద్ధి కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి గుంటూరు, విజయవాడ ప్రధాన రహదారులు విస్తరణ, మెరుగైన వైద్య సదుపాయాలు, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా, తెనాలి కళాకారుల సంస్కృతి తదితర అంశాలను ప్రాథమికంగా తీసుకుని తెనాలి పట్టణాన్ని అభివృద్ధి నిర్మాణంలో నడిపిస్తాం. తెనాలి పట్టణ పరిదిలో రోడ్లు విస్తరణతో పాటు నిఘా కెమెరాలు ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం. గ్రామీణ ప్రాంత రోడ్లు అభివృద్ధికి రూ 25 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇందులో భాగంగా తెనాలి కొల్లిపర సీసీ రోడ్లు అభివృద్ధి చేయబోతున్నామన్నారు. పట్టణంతోపాటు గ్రామీణ అభివృద్ధి కూడా చేస్తున్నామన్నారు. 1.76 ఎకరాల సువిశాల మున్సిపల్ భూమిని సేకరించి రూ. మూడు కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతాం. అందులోనే వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులు ఏర్పాటుతో పాటు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నాం. రూ 20 లక్షలు చినారావూరు పార్క్ ను మరమ్మత్తులు చేపట్టి డిసెంబర్ 30 నాటికి సుందరీకరణ చేయబోతున్నాం. రూ 1.15 కోట్లతో తెనాలి ఐతానగర్ లో ఐకర్స్ పార్క్ నిర్మాణం చేపడతాం. సంక్రాంతి పండగలోపు దుగ్గిరాల, మంగళగిరి రోడ్లు మరమ్మత్తులు పూర్తి చేస్తాం.