Breaking News

సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గారు జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ అదనపు ఎస్పి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, విశాఖపట్నం వారు సూచించిన మేరకు కోస్టల్ పోలీస్ స్టేషన్ దుగరాజ పట్నం కు సంబంధించిన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ మరమ్మత్తులకు, కాంపౌండ్ వాల్ నిర్మాణం అంశాలకు సంబంధించి నిధుల అందుబాటు మేరకు పరిశీలించి అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు. మెరైన్ అధికారుల కోరిన మేరకు పూడి రాయి దరువు వద్ద జెట్టి నిర్మాణానికి స్థలం గుర్తించారని అధికారులు చెబుతూ, అటవీ, పర్యావరణ తదితర అనుమతులు వచ్చిన తర్వాత జెట్టీ నిర్మాణానికి అవసరమైన 48 కోట్ల రూపాయల నిధులను షార్ వారు ఇస్తామని తెలిపారని కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. ఆ మేరకు సంబంధిత ఫారెస్ట్, రెవెన్యూ తదితర అధికారులు పురోగతి చూయించాలని కలెక్టర్ అన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తమ ఆధార్ కార్డు బయోమెట్రిక్ కార్డు వెంట తీసుకొని వెళ్లేలా చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించాలని జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజును కలెక్టర్ ఆదేశించారు. తూపిలి పాలెం దుగరాజపట్నం బీచ్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మెరైన్ పోలీసు అధికారులకు సూచిస్తూ దానికి అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన బోట్లు గుర్తించడానికి వాటికి నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ నందు ఖాళీలను భర్తీ కొరకు కోరగా సంబంధిత శాఖలు వారి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జిల్లా మత్స్య శాఖ వారు కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు అవసరం మేరకు సముద్రంపై అక్రమంగా చేపల వేట జరగకుండా జాయింట్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు. తమిళనాడు నుండి మత్స్యకారులు మెకనైజడ్డ్ బోట్లతో అక్రమంగా మన వైపు ఉన్న సముద్ర జలాల్లో చేపలు పట్టడం జరుగుతోందని అధికారులు తెలుపగా సదరు అంశం ప్రభుత్వం దృష్టికి పరిష్కార దిశగా తీసుకెళ్లడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అలాగే వారాంతపు సెలవులలో, పండుగల సందర్భాలలో తగినంత మంది గజ ఈతగాళ్లను బీచ్ ల వద్ద మెరైన్ పోలీసుల సమన్వయం చేసుకుని ఏర్పాటు చేసి పనిచేసేలా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. తగినన్ని నైలాన్ రోప్ లు, లైఫ్ జాకెట్లు తదితర సామాగ్రి అవసరముందని కోస్ట్ గార్డ్ అధికారులు తెలుపగా తగినంత సామాగ్రిని వారికి అందజేయాలని జిల్లా మత్స్య శాఖ అధికారినీ ఆదేశించారు. అలాగే మరింత అవసరమైతే ప్రతిపాదనలు సత్వరమే సిద్ధం చేసి పంపాలని సూచించారు. మెరైన్ పోలీసులు మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ గారి చొరవతో తిరుపతి జిల్లా తీర ప్రాంతమైన శ్రీనివాసపురం వద్ద సముద్రంలో నెల్లూరు జాలర్లు చిక్కుకున్న సమయంలో వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడంలో వారి కృషి అభినందనీయమని తెలిపారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది కోస్టల్ పోలీస్ అధికారులు మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సమన్వయం చేసుకుని పాల్గొనాలి అని సూచించారు. దుష్టశక్తులు, అరాచక శక్తులు సముద్ర మార్గాన మన రాష్ట్రంలోకి, మన జిల్లాలోని తీరప్రాంతాలలో సముద్ర మార్గం ద్వారా వచ్చి వారి అరాచక, అక్రమ కార్యకలాపాలు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోర్టు పరిసర ప్రాంతాలలోని పరిశ్రమలు, యూనిట్ల నిర్మాణాలలో వినియోగించే కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్ విషయంలో వారి యాంటిసిడెన్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, పోలీసులతో సమన్వయం, సమాచారం మార్పిడి అవసరం ఎంతైనా ఉందని డిసిఐఓ శిరీష తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ క్రైమ్ నాగభూషణరావు, అదనపు ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ మధుసూదన్ రావు, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ తిరుపతి సూపరింటెండెంట్ శ్యాంసుందర్ రెడ్డి, కోస్ట్ గార్డ్ అధికారి బేగ్, డిఎస్పి గిరిధర్, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, మెరైన్ పోలీస్ అధికారులు మాలకొండయ్య, వేణుగోపాల్ రెడ్డి, ఇండియన్ నేవీ నుండి కోస్టల్ సెక్యూరిటీ అధికారి ప్రతాప్ రెడ్డి మాయాన్క్ శర్మ, పోర్ట్ సి ఐ ఎస్ ఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *