Breaking News

జిల్లా అభివృద్దికి కేటాయించిన 200 కోట్ల రూపాయల పనులను జనవరి చివరి నాటికి అన్నీ పూర్తి చేయాలి

-వంద కోట్ల పనులను 70 శాతం సంక్రాంతి పండగ నాటికి పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పల్లె పండుగలో భాగంగా జిల్లా అభివృద్దికి కేటాయించిన 200 కోట్ల రూపాయల పనులను జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక కల్లెక్టరేట్ నుండి పంచాయతీ రాజ్, డ్వామా అధికారులతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ పల్లె పండుగలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామ అభివృద్దిని వేగవంతం చేయడం మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొంది జిల్లా అభివృద్దికి సంబంధించిన 200 కోట్ల రూపాయల పనులను జనవరి చివరి నాటికి అన్నీ పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో వంద కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయితీ రాజ్ పనులను 70 శాతం సంక్రాంతి పండగ నాటికి పూర్తి చేయాలని, మిగిలిన 30 శాతం పనులను జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్ సంబంధించిన పనులు పూర్తి చేయాలని, అనిమల్ షెల్టర్స్, హార్టికల్చర్, మిగతా మెటీరియల్ కంపోనెంట్, ఎంసీసీ స్థాయిలో మరో వంద కోట్ల పనులు ఉన్నాయని వీటిని కూడా డిసెంబర్ 31 నాటికి అనిమల్ షెల్టర్స్ 900 పూర్తి చేయాలని, హార్టికల్చర్, జిజిఐ, సోక్ పిట్ వంటి పనులు జనవరి 31 నాటికి పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలనీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు. ఈ సమావేశంలో డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి రామ్మోహన్, ఎంపిడిఓ లు, సహాయ ప్రాజెక్ట్ అధికారులు డ్వామా తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *