-సీఎస్ గా బీసీ బిడ్డ విజయానంద్ నియామకంపై మంత్రి సవిత హర్షం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీల పట్ల నిబద్ధతను సీఎం చంద్రబాబునాయుడును మరోసారి చాటుకున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. నూతన సీఎస్ గా బీసీ బిడ్డ విజయానంద్ ను నియమించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ ఆవిర్భావ నుంచి బీసీలకు పెద్దపీట వేస్తూ వస్తోందన్నారు. అన్న ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…బడుగు బలహీన వర్గాల వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తూ వస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ కు సీఎం చంద్రబాబుకు అవకాశమిచ్చారన్నారు. ఏపీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ బీసీ అధికారి సీఎస్ నియమితులవ్వడం గర్వంగా ఉందన్నారు. బీసీ బిడ్డకు కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
బీసీలకు కీలక బాధ్యతలు
చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం లభిస్తోందని మంత్రి సవిత తెలిపారు. తన కేబినెట్ లో మంత్రులుగా ఎనిమిది మందికి అవకాశమిచ్చారన్నారు. మరో బీసీ సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడిని శాసన సభ స్పీకర్ గా నియమించారన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రిగా అవకాశమిచ్చారన్నారు. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్ నిమియతులయ్యారన్నారు. సీఎస్ తోపాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు, టీటీడీ చైర్మన్ శ్యామలరావు కూడా బీసీలు కావడం గర్వకారణమన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఏనాడూ బీసీలను పట్టించుకున్న పాపానలోలేదన్నారు. కీలకమైన పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు బడుగు బలహీన వర్గాల వారిని రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు.