-చంద్రబాబు హయాంలో బీసీలకు పెద్ద పీట –
-గత ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం –
-టీటీడీ ఈవో, ప్రభుత్వ సీ.ఎస్ గా బీసీలను నియమించడం హర్షణీయం –
-రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని, గత ప్రభుత్వంలా మాటల ప్రభుత్వం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ వ్యక్తి అయిన విజయానంద్ నియామకం చంద్రబాబుకు, ఎన్డీయే ప్రభుత్వానికి బీసీలపై ఉన్న గౌరవాన్ని తెలియచేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీలపై దాడులు జరిగాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోనే ప్రధానమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రపంచ వ్యాప్తంగా కొలిచే అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా బీసీ వ్యక్తి శ్యామలారావును నియమించడం హర్షణీయం అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం మున్ముందు బీసీలకు మేలు చేకూర్చే పథకాలు మరిన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.