-నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవాని దీక్షల విరమణ సందర్భంగా శనివారం దుర్గా ఘాట్ సమీపంలోని మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నందు పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో మునిసిపల్ కమీషనర్ ధ్యాన్ చంద్ ఐ.ఎ.ఎస్., డి.సి.పి. లు గౌతమి షాలి ఐ.పి.ఎస్., కృష్ణ మూర్తి నాయుడు, రామకృష్ణ లు కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ… ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుండి భవాని దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమయ్యాయి, 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు భవాని దీక్ష విరమణలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాము, రాష్ట్రం నలుమూలల నుంచి ఏడాది ఏడు లక్షలు పై చిలుకు భవానిలు వస్తారని అంచనా వేస్తున్నాం, భవానీలు మాల విరమణ కోసం రెండు హోమగుండాలు, పలు విరమణ స్టాండ్ లను, ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు, భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు, సుమారుగా 1900 సిసి కెమెరాల ద్వారా అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి మానిటర్ చేస్తున్నాం, అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి వీలవుతుంది, భవానీల సౌలభ్యం కోసం దేవాదాయ శాఖ వారు ప్రత్యేకంగా దీక్ష విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తీసుకు వచ్చింది, భవాని భక్తులు అందరూ విరివిగా ఈ యాప్ ను ఉపయోగించుకుని వారి ప్రయాణం సులభతరం చేసుకోవాలని కోరుతున్నాము, ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా భవానీలను మోనిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నాం, కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేస్తూ సాంకేతికంగా ముందుకు పోతున్నాం.
టెక్నాలజీ వినియోగాన్ని అవకాసం ఉన్న ప్రతి చోటా వినియోగిస్తున్నాం, ఈ మధ్య క్లౌడ్ పెట్రోల్స్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ విరివిగా ఈ డ్రోన్ల వినియోగం చేస్తున్నాం, వివిధ ప్రదేశాలకు డ్రోన్ కెమెరాలను పంపి లైవ్ మానిటరింగ్ ద్వారా క్రమబద్ధీకరించడం జరుగుతుంది. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ తేలికయింది, గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది పకడ్బందీగా వ్యవస్థని పటిష్టం చేసాం, అదే విధంగా జిల్లా కలెక్టర్ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా సి. ఎం. ఎస్. అనే ఒక యాప్ ను రూపొందించి చిన్న పిల్లలకు టాగ్ లను కట్టడం ద్వారా ఎక్కడైనా పిల్లలు మిస్ అయితే వారి చేతికి ఉన్న టాగ్ ను స్కాన్ చేస్తే వెంటనే తల్లిదండ్రులు వివరాలు ఫోన్ నెంబర్లు మొదలైనవి వస్తాయి వాటి ద్వారా పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.
ఆర్.టి.సి. రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వచ్చే భవానీల రద్దీ ని క్రమబద్దీకరించడానికి చర్యలు తీసుకున్నాము. కమ్మునికేషణ్ వ్యవస్థని పటిష్టంగా ఏర్పాటు చేసాము, ఎటువని ఇబ్బంది లేకుండా భవాని భక్తులకు ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా చూసి ఏర్పాట్లు చేయడం జరిగింది. హోల్డింగ్ ఏరియాలలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పటిష్టంగా బందోబస్త్ ఏర్పాటు చేసాము, ఎందుకంటే రైవస్ కాలువా మీద ఏవిధమైన ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మునిసిపల్ కమీషనర్ సహకారంతో 17 ప్రదేశాలలో ఐ.టి.ఎం.ఎస్. వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా పోలీస్ శాఖ ఈ సారి చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసారు. దసరా సమయంలో వి.ఐ.పి.ల కోసం ఒక ప్రత్యేకమైన యాప్ ను తయారు చేయగా దానిని ప్రజలలోకి తీసుకువెళ్ళడంలో మీడియా మిత్రులు సహకరించారు, అదే విధంగా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము.
ఈ సందర్భంగా మునిసిపల్ కమీషనర్ మాట్లాడుతూ… భక్తుల కోసం ఐ.టి.ఎం.ఎస్. వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వి.ఎం.సి.నుండి సానిటేషన్ కు సంబంధించి ఎనిమిది ప్రదేసలలలో 150 టాయిలెట్స్ లను ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలూ పర్య వేక్షించేలగా అధికారులను సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా వాటర్ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. తాగు నీటి కోసం 10 లక్షల వాటర్ బాటిల్స్ లను మరియు 5 లక్షల వాటర్ ప్యాకెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా భవాని భక్తులు విరమణ అనంతరం వదిలివేసే రెడ్ క్లాత్ లను ఎప్పటికప్పుడు తీసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీస్, రెవెన్యూ , ఇరిగేషన్, ఇతర శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు.