ఎస్ ఆర్ కె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎనికెపాడు కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన ఫిట్ ఇండియా క్రీడా పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం జిల్లా సంస్ధ మరియు ఎస్ ఆర్ కె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎనికెపాడు ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆగస్టు-29, 2019 ప్రకారం దేశంలోని యువత అంతా ఆరోగ్యపరమైన మరియు కండరపుష్టిని కలిగి ఉండాలని శారీరక శ్రమ క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం కల్పించుకోవాలని ఈ ఫిట్ ఇండియా మూమెంట్ను తీసుకురావడం జరిగింది. ఈ ఫిట్ ఇండియా మూవ్మెంట్ ను పురస్కరించుకుని “స్వస్థ రాష్ట్ర- సమర్థ్ రాష్ట్ర” అనే థీమ్ తొ రోజు జిల్లాలోఎస్ ఆర్ కె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎనికెపాడు కాలేజి గ్రౌండ్స్ లో 20,21 తెదిలలొ రెండు రోజుల పాటు బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో మహిళలకు కబాడీ పురుషులకు వాలీబాల్ మరియు పురుషులకు మహిళలకు కలిపి రన్నింగ్ షటిల్ పోటీలు జరిగాయి క్రీడాకారులు పోటాపోటీగా తలబడ్డారు,
ఈ కార్యక్రమంలో జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ క్రీడాకారులు తమ మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజు కొంత సమయం ఆటలు ఆడుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ఏకాంబరం మాట్లాడుతూ క్రీడా పోటీల వల్ల మనలో స్ఫూర్తి వస్తుందని క్రీడలు ఎంతగానో ఆరోగ్యానికి దోహదపడతాయని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నెహ్రు యువ కేంద్రం వారికి తమ తరఫున ధన్యవాదాలు అన్నారు అనంతరం గెలిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి బి చిన్ని ప్రోగ్రాం నిర్వాహకులు బి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.