అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు.. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని… వర్షాల అనంతరం పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం అదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికిప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Tags amaravathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …