Breaking News

ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష

-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యాక్రమాల అమలు చైర్మన్, కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని మోడీ గారి ఆకాంక్ష వికసిత భారత్ 2047 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిలాష స్వర్ణాంధ్ర 2047 సాధనలో వికసిత గుంటూరు అత్యంత ప్రధానం. గుంటూరు కార్పొరేషన్ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకు కేంద్ర ప్రభుత్వం 2016 లోనే 540 కోట్లు సహాయం చేస్తే 2019 – 24 మధ్య పాలన నిర్లిప్తత వల్ల ఇప్పటికి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 50 % పూర్తీ చేసినట్లు చూపిస్తున్నారు, అది అనుమానమే – 2019 – 24 మధ్య పనులలో తీవ్ర అవినీతి, జాప్యం జరిగిందని అర్ధం అవుతుంది. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా యాక్టివ్ జాబ్ కార్డులున్న 90 వేలకుగాను 1.50 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది.

ఉపాధి హామీ వేతనాలు మరియు మెటీరియల్ కోసం చేసిన వ్యయంతో వాస్తవ ఆస్తుల కల్పన ఆడిట్ అవసరం, పనులలో నాణ్యత ప్రమాణాల లోపల పైన చర్యలు అవసరం. లాక్ పతి దీదీలతో మహిళా సాధికారిత సాధ్యం, ఇప్పటివరకు జిల్లాలో 53,214 మంది సామర్థ్యం కలిగిన లాక్ పతి దీదీలను గుర్తించారు, జిల్లాలో ఒక లక్ష మంది మహిళలను లాక్ పతి దీదీలుగా మలిచే అవకాశం ఉంది. గ్రామంలో గృహాలకు సురక్షిత త్రాగు నీటి కోసం కేంద్రం జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు ఇస్తున్న, గుంటూరు జిల్లాలో ఇప్పటికి 1.58 లక్షల గృహాలకు కుళాయి ఉంది అని లెక్కలు చెబుతున్న అందులో నాణ్యత ప్రమాణాలు సందేశమే – పల్స్ సర్వే ద్వారా నిజాలు బయటకు వచ్చాయి. గుంటూరు పట్టణం త్రాగు నీటి అవసరానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమృత్ 1.0 లో 40 కోట్లు నిధులు సకాలంలో ఖర్చు చేయలేదు. ఇప్ప్పుడు అమృత్ 2 .0 లో 184 కోట్లతో నిధులు వస్తున్నాయి.

గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని గృహాలు 2.43 వేలు, ఇందులో 1/౩ వంతు ఇండ్లకు నీటి కుళాయిలు లేవు. గుంటూరు పట్టణానికి కృష్ణ నది నుండి నీటి వనరులున్న ఇప్పటికి ప్రతి రోజు ౩౩ మెగా లీటర్ల నీరు కొరత ఉండడం వల్ల త్రాగు నీరు సప్లై ఇబ్బందికరంగా ఉంది. జిల్లాలో జనాభా 20.91 లక్షలు – మొత్తం రేషన్ కార్డులు 5,99,553 ( జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద : 1,74,431 & రాష్ట్ర ప్రభుత్వం కార్డులు : 4,25,122 ) – రాష్ట్రంలో సగటున కుటుంభానికి జనాభా ౩.9 మంది, మరి గుంటూరు జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 5,99,553 లో ఉన్న ప్రజలు ఏంతమంది?

మొత్తం 972 లో 330 రేషన్ షాపుల డీలర్ల ఎంపిక పూర్తీ కాలేదు.

PMAY : గుంటూరు జిల్లా పరిధిలో పట్టణ ప్రాంతాల్లో 65800 పేదల కోసం గృహాలు ప్రారంభిస్తే, పూర్తీ అయినవి 20368 మరియు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న గృహాలు 45000 గృహాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ప్రతి ఇంటి నిర్మాణానికి 1.50 లక్షలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో అదనంగా మరో 30 వేలు సహాయం చేసింది. ఇండ్ల నిర్మాణం మాత్రమే కాదు ప్రజలు నివాసయోగ్యమైన మౌలిక సదుపాయాలూ సురక్షిత త్రాగు నీరు మరియు విద్యుశ్చక్తి సరఫరా కి అవసరమైన పనులు , డ్రైన్లు, వీధి లైట్లు, రాకపోకలకు దాడులు, కామన్ యుటిలిటీ కోసం అవసరమైన స్థలం తదితర అంశాలను పూర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది.

TIDCO గృహాలు : మొత్తం ప్రారంభించిన గృహాలు 18448 , రిజిస్ట్రేషన్ పూర్తీ అయినవి : 13726 అయితే కేవలం 7419 గృహాలలో నివాసం ప్రారంభం అయ్యింది అంటే మిగతా గృహాలను లబ్ధిదారులు నివాసం ప్రారంభించలేదో చూశారా ? లేకుంటే ఇండ్లు పూర్తీ కాకుండా రిజిస్ట్రేషన్ పూర్తీ చేశారా లేక 2019 – 24 మధ్య జరిగిన పాలన నిర్ణయాల లోపల వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారా లేక పూర్తికాకుండా రిజిస్ట్రేషన్ చేసేశారా? అని ప్రశ్నించడం జరిగింది

పీఎం ఫసల్ బీమా యోజన – 2019 – 22 మధ్య 44,274 మంది రైతుకు 49.15 కోట్ల రూపాయిలు ప్రీమియం చెల్లిస్తే, వచ్చిన క్లెయిమ్లు 35,194 మంది రైతుకు 19.30 కోట్ల రూపాయిలు మాత్రమే. ఈ పథకం క్రింద రాష్ట్రంలో 2016 – 19 మధ్య దాదాపు 3,500 కోట్ల రూపాయిల నష్టపూర్తి జరిగితే, 2019 – 24 మధ్య ఒక్క 2019 – 20 లో మాత్రమే 1,253 కోట్ల రూపాయిలు మాత్రమే క్లైములు వచ్చాయి అంటే ప్రీమియం 2019 ముందు సకాలంలో కట్టినందువల్ల మాత్రమే, 2020 నుండి 2024 మధ్య క్లైములు శూన్యం. సకాలంలో ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టే విధంగా రైతులకు సమాచారం ఇవ్వలేని ఆదేశించడం జరిగింది.

గుంటూరు జిల్లా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సగటున 70 కోట్ల రూపాయిల లబ్ది జరిగింది, ఈ సంవత్సరం ఇప్పటివరకు అర్హులైన ప్రతి రైతుకు రెండు వాయిదాలు క్రింద 4 వేలు అందాయి.

ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి బాగ్ కి 2,000 రూపాయిల యూరియా సబ్సిడీ ఇస్తుంది, గుంటూరు జిల్లాకు 70 నుండి 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై అవుతుంది. బ్లాక్ మార్కెట్ పైన ఉక్కు పాదం మోపాలని ఆదేశించడం జరిగింది.

రాష్ట్ర వ్యవసాయానికి వెన్నుముక ప్రాతమైన తెనాలి సర్కిల్ లో పీఎం కుసుమ్ క్రింద 10,574 సోలార్ పంప్ సెట్లు కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి, వీటిని బాగా పెంచాల్సిన అవసరం ఉంది.

పీఎం సూర్యఘర్ క్రింద గుంటూరు సర్కిల్ లో 2,475 రిజిస్టర్ అయితే పూర్తీ అయ్యింది కేవలం 344 మాత్రమే, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న క్షేత్రస్థాయి ప్రచారం తక్కువ వుంది.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *