-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై సమీక్ష సమావేశం జరిగింది.బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన జరిగిన సమావేశంలో బిజెపి రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాకా వెంకట సత్యనారాయణ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ఎన్నికల నిర్వహణ పై మార్గదర్శనం చేశారు. ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నాటికి మండల పార్టీ ఎన్నికల ను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తీసుకోవాల్సి న చర్యలు వివరించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉందంటే అందుకు కారణం బిజెపి క్షేత్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ నిర్వహణ కేవలం బిజెపి లో మాత్రం ఉండడం గర్వకారణం అన్నారు. సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే లు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.