-బీఎస్పీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్రరావు
-“సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలికి ఎన్ఠీఆర్ మనవడు తాకీదులివ్వడం, బీసీలను అణగదొక్కుతూ, అవమానిస్తూ, పైకి బీసీల పార్టీ అంటూ ప్రేమ నటించడం కాదా?”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీలు బార్న్ క్రియటర్స్ అని చెప్పుకోవాలని, వారందరూ కరుణానిధి స్పూర్తితో ఏకమైతేనే వారికి రాజకీయ మనుగడ, తమిళనాడు తరహాలో అన్నివిధాలుగా ప్రాధాన్యత సాధించుకోగలరని, బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బీసీ మేధావుల వేదిక స్థాపనకు సన్నాహకంగా జరిగిన కార్యక్రమంలో అయన ఈ విధంగా అన్నారు: బీసీల్లోని ఒకటి రెండు కులాల మీద ఇతర బీసీ వర్గాలకు ద్వేషం రైగిల్చేలా రెండు కులాల పార్టీలు అనాదిగా వ్యవరిస్తున్నాయని, దీనికి ఇటీవల సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన విషయమే ఉదాహరణ. సాక్షాత్తు సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలిని, మరొక్క సీనియర్ బీసీ నాయకునికి తాకీదులిచ్చి బీసీల్లోనే చిచ్చుపెడుతున్నారు. ఈ తాకీదులు కమ్మకులానికి చెందిన లోకేష్ ఎందుకివ్వాల్సి వస్తుంది, పార్టీ ప్రెసిడెంట్ ఒక బీసీ ఉండగానే? ఇదే కాలాతీతంగా జరుగుతున్న దుర్మార్గం. బీసీలను అణగదొక్కి, వారి గొంతు నొక్కేస్తున్న కమ్మ, రెడ్ల కులాల పార్టీలు.
ఈ సందర్గంగా మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మీద అన్నవరపు బ్రహ్మయ్య రచించిన “ద్రవిడ సూరీడు” పుస్తకాన్ని బీసీ ప్రముఖులు ఆవిష్కరించారు. “కులందప్రదేశ్ లో తమిళనాడు తరహా బీసీ ప్రాతినిధ్యం సాధించాలంటే అక్కడిలాగా పెరియార్ పాలిటిక్స్, పెరియార్ వాదం ఇక్కడ కూడా రావాలి. కేవలం తమిళనాడు తరహాలో రోడ్ల మీద విగ్రహాలు పెట్టేస్తే చాలా? తెలుగుదేశం పార్టీ బీసీ ప్రేమ అనేది ఒక పెద్ద బూటకం. అంతర్గంతంగా బహుజన వాదాన్ని ఎప్పుడు ఈ పార్టీలు గౌరవించలేదు.”
‘గత 16 ఎన్నికల్లో కులాంధ్రప్రదేశ్ లో 10 శాతం ఉన్న కమ్మలు, రెడ్లు 2902 ఎమ్మెల్యేలు, మరి ౫౦ శాతం పైగా ఉన్న బీసీలు కేవలం 498 మంది మాత్రమే అయ్యారు. ఈ పరిస్థితిలో మార్పు కావాలంటే బీసీలు ఏకంకావాలి. ముందుగా మనం కూడా బీసీలమని గుర్తించాలి. ఈ రాష్ట్రానికి బీసీలే వెన్నెముక అని చాటిచెప్పాలి. బీసీలు ఏకమైతేనే తమిళనాడు తరహాలో అభివృద్ధి జరుగుతుంది, ఇందుకు కరుణానిధి స్పూర్తితో మనమందరం ముందుకెళ్లాలి”
ఈ కార్యక్రమంలో టీ చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్, BV రమణకుమార్, M రవీంద్రనాథ్ బాబు – రిటైర్డ్ IPS అధికారులు, బి రామారావు – రిటైర్డ్ IAS మరియు ప్రముఖ పాత్రికేయులు, రచయితశ్రీ అన్నవరపు బ్రహ్మయ్య పాల్గొన్నారు.
ఆంతకుముందు బీఎస్పీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద, అంబేద్కర్ పట్ల అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి, అమిత షా వెంటనే రాజనీమా చేయాలనీ, అప్పటివరకు బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఈ నెల 24 వ తారీఖున బెహెన్జీ మాయావతి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకేంద్రాలన్నిటిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియచేసారు.