Breaking News

ఒంటి చేత్తో పది పనులు చక్కబెట్టే శక్తి ఒక్క మహిళలకే సాధ్యం

-మహిళలు డబ్బు కోసం దేహీ అనకూడదు
-ఆడవాళ్లు ఎందులోనూ మగవారితో తీసిపోరు
-స్త్రీలకు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారు
-మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా వ్యవస్థ తెచ్చారు
-3వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో నారా భువనేశ్వరి వెల్లడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకోకూడదు. అవకాశాలు ఇవ్వాలేకానీ ఆడవారు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. 3వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాంతిపురం, మొరసనపల్లిలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం డ్వాక్రా మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈసందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ మగవాళ్లదేముంది…ఉద్యోగం చేయడం,ఇంటికొచ్చి భార్య వండింది తిని కూర్చోవడం కదా…అదే వాళ్లు అలా కాదు…ఒంటి చేత్తో ఏకకాలంలో 10 పనులు చక్కబెట్టగలరు. మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తూనే ఇంటి బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. పిల్లల చదువులు చూసుకుంటున్నారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు.

మహిళలను డ్వాక్రాకు ముందు తర్వాతగా చూడాలి:
మహిళలు అన్ని రంగాల్లో మగవారిని మించి విజయాలు సాధించాలని చంద్రబాబు కోరుకుంటూ ఉంటారు. మహిళలు డబ్బు కోసం ఇబ్బంది పడకూడదని, వారు ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే డ్వాక్రా సంఘాలు స్థాపించారు. డ్వాక్రా ఏర్పాటుతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. ఒకప్పుడు వందా , రెండు వందల కోసం ఇతరులపై ఆధారపడిన స్త్రీలు నేడు బ్యాంకు లావాదేవీలు స్వయంగా చూసుకునే స్థాయికి చేరారంటే అది చంద్రబాబు  తీసుకొచ్చిన డ్వాక్రాతోనే సాధ్యమైంది. చంద్రబాబు ని అక్రమ కేసుతో అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు నా వెంట మహిళా లోకం నడిచింది. రాష్ట్రమంతటా మహిళలు పెద్దఎత్తున బయటకు వచ్చి సంఘీభావం తెలిపారు. నాకు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించి పారిశ్రామికవేత్తను చేసింది చంద్రబాబు. నేను ఇవాళ వేలమందికి ఉపాధి కల్పిస్తున్నానంటే అందుకు చంద్రబాబు  ప్రోత్సాహమే కారణం.

కుప్పంలో అభివృద్ధి పరుగులు:
కుప్పం నియోజకవర్గంలో మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు అనేక కంపెనీలు వస్తున్నాయి. శాంతిపురంలో పెద్ద కంపెనీ రాబోతోంది. దాని వల్ల మహిళలకు ఉపాధి లభిస్తుంది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాము. మీకు ఎటువంటి సాయం కావాలన్న అడగండి. మహిళలకు చేయి అందించి పైకి తెచ్చేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము.

ఇవాళ నారా బ్రాహ్మణి  పుట్టినరోజు సందర్భంగా గ్రామస్థుల సమక్షంలో భువనేశ్వరి కేక్ కట్ చేశారు. చెక్కతో తయారుచేసిన సీఎం చంద్రబాబు, దేవాన్ష్ , భువనేశ్వరి  ఫోటో ఫ్రేమ్ ను గ్రామస్థులు బహుకరించారు. బెంగుళూరు టీడీపీ ఫౌండర్ కనకమేడల వీరాంజనేయులు రూ. లక్ష చెల్లించి నారా భువనేశ్వరి  చేతుల మీదుగా టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు.

Check Also

కరుణానిధి స్ఫూరితోనే బీసీల మనుగడ, తమిళనాడు తరహా అభివృద్ధి

-బీఎస్పీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్రరావు -“సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలికి ఎన్ఠీఆర్ మనవడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *