-ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటిమి అభ్యర్థుల గెలుపు జగన్ రెడ్డి, వైసీపీకి చెంప పెట్టు అని.. 100 % స్టైక్ రేటుతో నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను రైతులు గెలిపించారంటే.. రైతాంగం అంతా కూటమి వైపే ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడారు.
నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నాడు వ్యవసాయాన్ని రక్షించుకోవాలని రైతులను కాపాడాలని చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కాని గత జగన్ రెడ్డి పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసానికి గురైంది. విధ్వంసానికి గురైన ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. గత పాలనలో కాలువల్లో కనీసం గుర్రపుడెక్క తూడును కూడా తియ్యలేదు. తట్ట మట్టిని కూడా తొలగించలేదు, సాగునీటి ప్రాజెక్టుల రిపేర్ల ను పూర్తిగా విస్మరించారు. కనీసం గ్రీజు కూడ పెట్టలేదు. ఇటువంటి దుస్తితి నుండి అధిగమించి సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించింది. నీటి సంఘాల ఎన్నికలకు ఏకపక్షంగా రైతులు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ఘనవిజయంగా భావించాలి. గత ఐదేళ్ల రైతు వ్యతిరేక పాలనతో అన్నదాతలు విసుగెత్తి పోయారు.
సాగు నీటి సంఘాల ఎన్నికలతో అన్నదాతలకు ఆ రైతుబిడ్డలే సేవ చేసే అవకాశం దక్కింది. 48 వేల మంది నీటి సంఘాల సభ్యులుగా 6,059 మంది నీటి సంఘాల అధ్యక్షులు, 6,059 ఉపాధ్యక్షులుగా, 267 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ లు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ లు అలాగే 58 మంది ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ లు మరో 58 మంది ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ లు దాదాపు 60 వేల మంది ఈ సాగు నీటి సంఘాల ద్వారా రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 93% స్టైక్ రేట్ తో కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తే నేడు ఏపీలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో వంద శాతం స్టైక్ రేట్ తో కూటమి అభ్యర్థులు గెలవడానికి మద్దతు తెలిపిన రైతులకు ధన్యవాదాలు తెలియచేస్తున్న. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కోటి మంది రైతుల భాగస్వామ్యంతో కూటమి అభ్యర్థులు గెలిచారు. రాబోయే రోజుల్లో నిర్వీర్యమైన సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టడానికి సాగునీటి సంఘాలు చాలా దోహద పడతాయి.
సాగునీటి సంఘాల వ్యవస్థను అందులో రైతుల భాగస్వామ్యాన్ని తీసుకు వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్న. సాగునీటి సంఘాల్లో రైతుల ఇచ్చిన స్ఫూర్తి రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా పటిష్టంగా పనిచేసేలా దోహద పడుతోంది. 2027 డిసెంబర్ నాటిని పోలవరంను పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్నాం. పోలవరం ఎడమ కాలువ నుండి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించేందుకు రూ. 900 కోట్లతో టెండర్లు పిలిచి 2025 జూన్ కల్లా నీటిని అందించేందుకు కృషి చేస్తున్నాం. రాయలసీమకు హంద్రినీవా ద్వారా సాగునీరు తాగునీరు అందించేందుకు రూ. 2500 కోట్లతో డిసెంబర్ లో పనులు ప్రారంభించి 2025 జూన్ నాటికి కనీసం 3550 క్యూసెక్కుల నీరును ఆకరి ఎకరా వరకు అందించేందకు కృషి చేస్తున్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ పనులను 2026 జూన్ నాటికి పూర్తి చేసి జలాలను వెనుకబడిన ప్రకాశం జిల్లాకు అందించేందకు కృషి చేస్తున్నాం. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ఉన్న సవాళ్లను అదిగమించి ప్రాజెక్ట్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. నదుల అనుసంధానంతో ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చూడడమే చంద్రబాబు కల. పత్రి నీటిబొట్టును ఒడిసి పట్టి ఆకరి ఆయకట్టు వరకు నీరు తీసుకెళ్లాలన్న చంద్రబాబు ఆలోచన, ఆశయం సాగునీటి సంఘాలతో సాధ్యపడుతుందని భావిస్తున్న అని అన్నారు.