Breaking News

డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి…

-అనధికారిక,రిజిష్టర్డ్ కాని పైనాన్షియల్ ఇనిస్టిస్ట్యూట్లను నియంత్రించాలి
-ఇన్వెస్టర్ అవేర్నెస్,ఫైనాన్షియల్ లిటరసీపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రెగ్యులేటింగ్ ఏజెన్సీలతో వర్చువల్ విధానంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ(ఎస్ఎల్సిసి) సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది.అమరావతి సచివాలయం మొదటి బ్లాకు నుండి ఈసమావేశంలో పాల్గొన్న సిఎస్ మాట్లాడుతూ ఇన్వెస్టెర్లు మరియు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈఎస్ఎల్సిసి ఫోరమ్ మరింత సమర్ధ వంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఇన్వెస్టెర్ అవేర్నెస్ మరియు ఫైనాన్షియల్ లిటరసీ విషయంలో ప్రజల్లో పెద్దఎత్తున అవగాహనను మరింత పెంపొందించేందుకు వివిధ రెగ్యులేటర్లు,రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు విశేషంగా కృషి చేయాల్సి ఉందనుటలో ఎలాంటి సందేహం లేదని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.అంతేగాక వారి హక్కులను కాపాడటం,వారి సమస్యలను పరిష్కరించడంలో ఈఫోరమ్ మెరుగైన ఫలితాలను సాధిస్తోందని పేర్కొన్నారు.అదే విధంగా ఎస్ఎల్సిసి ఫోరమ్ నిర్దేశిత లక్ష్యాలను సాధించుటలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్ఎల్సిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై నిర్దేశిత గడువు ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ఎస్ఎల్సిసి కమిటీ సభ్యులందరికీ సూచించారు.అంతేగాక కమిటీ సభ్యులు వారి అప్ డేటెడ్ సమాచారం ఇతర ఇన్ పుట్ లను సబ్ కమిటీకి సకాలంలో అందించగలిగితే ఎస్ఎల్సిసి సమావేశంలో వాటిపై సవివరంగా చర్చించేందుకు అవకాశం ఉంటుందని ఆదిశగా అంతా కృషి చేయాలని సిఎస్ సూచించారు. సభ్యులందరూ మార్కెట్ ఇంటిలిజెన్సు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సమావేశం దృష్టికి తెచ్చి చర్చించడం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.గత సమావేశం తర్వాత తీసుకున్నచర్యల్లో మెరుగైన ప్రగతి సాధించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హైదరాబాదు నుండి పాల్గొన్నరిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ కోడూరి నిఖిల తొలుత సమావేశానికి స్వాగతం పలికి అజెండా అంశాలను సమావేశం ముందుకు తీసుకుని వచ్చారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ డిపాజిట్ దారుల ప్రయోజనాలను కాపాడుటలో ఈ ఎస్ఎల్సిసి అపెక్సు కమిటీ ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.ముఖ్యంగా అనాధరైజ్డ్ మరియు అన్ రిజిష్టర్డ్ పైనాన్షియల్ ఇనిస్టిస్ట్యూట్లను నియంత్రించుటలో ఈకమిటీలోని ఏజెన్సీలన్నీ సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు.జూలై మొదటి వారం వరకూ 842 ఫిర్యాదులు రాగా వాటిలో 600 ఫిర్యాదులు వరకూ కేవలం ఒక్క డిజిటల్ లెండింగ్ కు సంబంధించినవే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం అజెండా అంశాలు గత సమావేశపు మినిట్స్ ను ఆమోదించడం,గత సమావేశపు యాక్షన్ టేకెన్ రిపోర్టు(ఎటిఆర్)ను ఆమోదించడం జరిగింది.తదుపరి అగ్రిగోల్డు, అభయ మరియు అక్షయ గోల్డు,హీరా గ్రూపు,కపిల్ తదితర చిట్ ఫండ్ కంపెనీలు,మల్టీస్టేట్ కోఆపరేటివ్ సంస్థలపై నమోదైన కేసులు వాటి ప్రగతి, బాధితులను ఆదుకున్న అంశాలపై సమావేశంలో చర్చించారు. అంతేగాక డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ పై ప్రజల్లో అవగాహనను పెంపొందించడం,బానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ యాక్టు 2019,నూతన మార్కెట్ ఇంటిలిజెన్సు,క్రిప్టోకరెన్సీ అంశాలపైన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్ధికశాఖ ఇఓ కార్యదర్శి సత్యనారాయణతో పాటు వర్చవల్ విధానంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ వై.జయకుమార్, సెబీ, ఎంసిఏ ఐఆర్డిఏఐ, ఎన్ హెచ్బి ఏజెన్సీల ప్రతినిధులు, సిఐడి, సహకార, రిష్ట్రేషన్స్, పోలీస్ తదితర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *