విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గురుపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా సాయిబాబా మందిరాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. కాకాని నగర్ అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ఉన్న శ్రీ కళ్యాణ సాయిబాబా మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాలలో శాసనసభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గురుపౌర్ణమి రోజున గురువులను పూజించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం చాలా ప్రముఖమైనదన్నారు. సమస్త జగత్తునందున్న అజ్ఞానాంధకారాన్ని తొలగించడంతో వ్యాసుడు జగద్గురువుగా ప్రకాశించాడన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు మాత్రమే ఆ స్థానం కల్పించారని గురువుల రుణం తీర్చుకోలేనిదన్నారు. కార్యక్రమంలో 26వ డివిజన్ వైసీపీ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు, పగడాల మధు, దాసు, శిద్ధాబత్తుల రమణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …