మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన మోపిదేవి లో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) రాష్ట్ర సంఘ నేతలు దర్శించుకున్నారు. ఆలయ పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ మర్యాదలతో గౌరవించారు. స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో “పెన్” జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి సామర్ల మల్లికార్జునరావు, సీనియర్ పాత్రికేయులు సుబ్బారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags mopidevi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …