Breaking News

అక్రిడేషన్స్ విషయంలో ఆందోళన వద్దు….

-“పెన్”నేతలు బడే, సింహాద్రి

నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్స్ అందుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర సంఘ నేతలు బడే ప్రభాకర్, సింహాద్రి కృష్ణ ప్రసాద్ లు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ సమాచార శాఖ అక్రిడేషన్స్ జారీ చేస్తుందన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం నాగాయలంకలో కోవిడ్ బారిన పడి స్వస్థత పొందిన పాత్రికేయుని పరామర్శించేందుకు విచ్చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు కొన్ని జిల్లాలలో ఇప్పటికే జారీ చేసిన అక్రిడేషన్ సంఖ్యను చూసి రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులు ఆందోళన చెందుతున్నారని, అయితే మొదటి విడతగా ప్రభుత్వం కోరిన పత్రాలన్నీ సక్రమంగా ఉన్న వారికి అక్రిడిటేషన్స్ జారీ చేయడం జరిగిందని, ఇతర జిల్లాలలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభం లో ఉందని సమాచార శాఖ అధికారులు పత్రాలు సమర్పించిన పిదప మిగిలిన అర్హులందరికీ కూడా అందించడం జరుగుతుందన్నారు. చిన్న పత్రికలు సంబంధించి జీఎస్టీ విషయంలో వెసులుబాటు కల్పించి అక్రిడేషన్స్ అందించాలని మంత్రి పేర్ని నాని కి విజ్ఞప్తి చేసినట్లు ప్రభాకర్ తెలిపారు. అయితే పత్రికల నడుపుతున్నప్పుడు సంబంధిత ప్రింటర్స్ వద్ద నుండి జీఎస్టీ తీసుకునేందుకు అభ్యంతరం మేమిటని మంత్రి అన్నారన్నారు. ఆర్థిక పరిస్థితులను, గోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెసులుబాటు కల్పించే యోచన చేయాలని ప్రభాకర్ మంత్రి నాని కి విజ్ఞప్తి చేసినట్లు నాని క ప్రభాకర్ పేర్కొన్నారు.నిరంతరంజర్నలిస్ట్స్ సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న “పెన్ “సంఘ పరంగా జర్నలిస్టులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనుంది అన్నారు. సంఘ సభ్యులకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఆర్థికంగా ఆదుకునే దిశగా సంఘం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు సింహాద్రి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అక్రిడేషన్స్ ప్రక్రియ విషయంలో సాంకేతిక లోపాల కారణంగా గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి అని ఆందోళన చెందాల్సిన పనిలేదని అర్హులైన అందరికీ అక్రిడేషన్స్ అందుతాయన్నారు. పెన్ సంఘం జర్నలిస్టు అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తోందన్నారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితి విషయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు సంఘ పరంగా ఆర్థిక సహకారం అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామర్ల మల్లికార్జునరావు, నియోజకవర్గ నాయకులు లేబాక నాగేశ్వరరావు,బాసు లంక బాబు,రాష్ట్ర సంఘ నాయకులు టి వి రంగారావు తదితరులు పాల్గొన్నారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి వేదిక రెవెన్యూ సదస్సులు

-దొమ్మేరు రెవిన్యూ సదస్సు లో 30 అర్జీలు -కొవ్వురు ఆర్డిఓ రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *