Breaking News

ఫ్రైడే డ్రై డే కార్యక్రమంపై అవగాహన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్రైడే డ్రై డే సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆదేశాలతో రాష్ట్ర టీం, జిల్లా మలేరియా అధికారి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే మీద ప్రజలకు అవగాహన కార్యక్రమము ప్రసాదంపాడు 2 సచివాలయం పరిధిలో నిర్వహించడం జరిగింది. వైద్యాధికారిని డాక్టర్ విజయ్ పర్యవేక్షణలో ఫ్రైడే డ్రై డే ని పురస్కరించుకొని ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి డా:మోతి బాబు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజలు అందరూ పొడి దినంగా పాటించి ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ఫ్రిడ్జ్ ల వెనక, కూలర్లలో, పూల కుండీలలో పాత టైర్లలో కంటైనర్ లో ఇతరత్రా వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు ఆరోగ్య సిబ్బంది వారి ఏరియాలో భవన నిర్మాణలను పరిశీలించి నీరు లేకుండా వాటిల్లో దోమల లార్వా వృద్ధి చెందకుండా ఎం ఎల్ ఓ ఆయిల్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డా:యోతి బాబు, స్టేట్ టెక్నికల్ ఆఫీసర్ హెచ్ ఈ ఓ సుబ్రహ్మణ్యం, రామచంద్రుడు, ఎస్ యు ఓ అప్పారావు, హెచ్ ఎస్ సాంబశివరావు, ఎండబ్ల్యూహెచ్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు,సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *