గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికకు దాఖలు జరిగిన 17 నామినేషన్లు వ్యాలిడ్ అయ్యాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ చే ఎన్నికల అధికారిగా నియమింపబడిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు సోమవారం తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఫిబ్రవరి 3న ఎన్నిక జరుగుతుందని తెలిపారు. 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా, సోమవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు అభ్యర్ధుల సమక్షంలో నామినేషన్లను స్క్రూట్ని చేశామని తెలిపారు. స్క్రూట్ని అనంతరం 17 నామినేషన్లు పోటీకి అర్హత కల్గినాయని తెలిపారు. అలాగే ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని, అదే రోజు 3 గంటల తర్వాత పోటీల్లో ఉండే తుది అభ్యర్ధుల జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఎన్నిక జరుగుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News