Breaking News

మరింత పటిష్టంగా వృద్ధుల సంరక్షణా చట్టం అమలు…

-వయోవృద్ధుల బాగోగులు చూడనివారిని గుర్తించి సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తాం…
-స్పందనలో అందిన అర్జీ లను సత్వరమే పరిష్కరించాలి…
-సబ్ కలెక్టరు జి. సాయిసూర్యప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వృద్ధుల సంరక్షణ చట్టాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేస్తామని విజయవాడ సబ్ కలెక్టరు జి.సాయి సూర్య ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ డివిజన్ కేంద్రమైన సబ్ కలెక్టరు కార్యాలయంలో సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను ఆయన సానుకూలంగా విన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సమస్యల పరిష్కారంలో భాగంగా వృద్ధుల సంరక్షణా చట్టం అమలుపై ప్రత్యేక దృష్టిసారించా మన్నారు. తాము సబ్ కలెక్టరుగా వచ్చిన తర్వాత ఇంతవరకూ 18 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇంకా పటిష్టంగా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. ట్రిబ్యునల్ లో తీర్పులు అనంతరం ఆయా ప్రాంతాల్లో అవి అమలు అవుతున్నాయా, వృద్ధుల పరిస్థితిని స్థానిక సచివాలయ మహిళా పోలీసులు వాలంటీర్ల ద్వారా వాకబు చేస్తున్నామన్నారు. తమకు సరైన రీతిలో పరిహారం తమ కుమారులు, కుమార్తెలు, తదితరులు నుంచి అందడం లేదనే వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ట్రిబ్యునల్ ఛైర్మన్ గా సబ్ కలెక్టరు పేరిట బ్యాంకు ఖాతాను తెరిచి అందులో ఆసొమ్ము జమ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పిమ్మట ఆసొమ్మును బాధితుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఇంటి అద్దెలు తమకు రావడం లేదని తెలిపిన విషయంపై కూడా మున్సిపల్ కమిషనర్లకు లేఖలు వ్రాసామని ఆమేరకు వారికి రావాల్సిన అద్దెలను కూడా ఈ ఖాతాలో జమచేసి తిరిగి బాధితులకు చెల్లింపుకోసం వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తహశీల్దార్లు, వాలంటీర్లు, సచివాలయం మహిళా పోలీసులకు వారి ప్రాంతాల్లో వృద్ధుల బాగోగులను ఆరాతీసే సమయంలో ఆ పెద్దలను సరిగ్గా చూడని వారసులను గుర్తించి ఆకేసును సుమోటోగా తీసుకుని విచారిస్తామని ఆయన చెప్పారు. గతంలో ప్రతీ నెలా 3వ శనివారం వృద్ధుల సంరక్షణా చట్టం కేసుల పై విచారణ నిర్వహించడం జరి గేదని అయితే కేసుల సత్వర పరిష్కారంకోసం వారంలో ప్రతీ మంగళ, శనివారం విచారణ నిర్వహిస్తున్నామన్నారు. స్పందన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ సూచించారు. స్పందన కార్యక్రమంలో ఇంతవరకూ 1767 అర్జీలు రాగా, వాటిలో 1723 పరిష్కరింప బడ్డాయన్నారు. మరో 31 అర్జీలు పరిష్కారగడుపులోపు ఉండగా, ఒక అర్జీ నిర్ణీత గడువుదాటి ఉందన్నారు. మరో 12 అర్జీలను రీఓ పెన్ చేయడం జరిగిందని వివరించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అర్జీలు అందించేందుకు వచ్చే వినతిదారులకు ప్రత్యేకంగా కుర్చీలు వేయించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజల నుంచి సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్ వినతులను స్వీకరించారు. విజయవాడ రూరల్ మండలం రాయనపాడుకు చెందిన చింతపల్లి దాసు వినతిపత్రం ఇస్తూ రెండు యసి కాలనీల మధ్య పాత పంటకాల్వలో నీరునిల్వ, వ్యర్థ పదార్థాలను తీయించి నీరు పారేటట్లు, పంట కాల్వపై చప్టా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఉపాధిహామీ పధకం క్రింద శ్మశానవాటిక మెరక చేయించి బోరు బావి వేసేందుకు చర్యలు తీసుకోవాలని దాసు సబ్ కలెక్టరును కోరారు. కార్యక్రమంలో సబ్ కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి యస్. శ్రీనివాసరెడ్డి, డిప్యూటి డిఇఓ యల్. చంద్రకళ, సిడిపిఒ జి. మంగమ్మ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రజని, వ్యవసాయశాఖ ఏఓ టి. సుప్రియ, పౌరసరఫరాలు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *