Breaking News

కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ కు విశేష స్పందన… : కలెక్టరు జె.నివాస్

-82,562 మందికి కోవిడ్ టీకాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ లో 82,562 మంది కోవిడ్ టీకాలు పొందారని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. కోవీ షీల్డ్ మొదటి డోసను 69,289 మంది పొందగా, రెండవ డోస్ ను 11 వేల 773 మంది వెరసి 81,062 మంది కోవిడ్ టీకాలు పొందారన్నారు. కోవ్యాక్సిన్ మొదటి డోసును 325 మంది పొందగా, రెండవ డోసను 1175 మంది వెరసి 1500 మంది కోవిడ్ టీకాలు వేయించుకున్నారన్నారు. ఇదిలాఉండగా జిల్లాలో ఇంతవరకూ 18,62,861 మంది కోవిడ్ టీకాలు పొందారన్నారు. హెల్త్ వర్కర్లు 79,909 మంది టీకాపొందగా, వారిలో మొదటి డోస్ పొందిన వారు 46,070 మంది, రెండవడోస్ పొందిన వారు 33,839 మంది ఉన్నారన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు 2,34,364 మంది టీకాపొందగా, వారిలో మొదటి డోస్ పొందిన వారు 1,60,712 మంది, రెండవడోస్ పొందిన వారు 73,652 మంది ఉన్నారన్నారు. 45 సంవత్సరాలు పైబడినవారు 12,63,975 మంది టీకాపొందగా, వారిలో మొదటిడోస్ పొందిన వారు 9,18,700 మంది, రెండవడోస్ పొందిన వారు 3,45,275 మంది ఉన్నారన్నారు. 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యవయసు కలిగిన 36,750 మంది టీకాపొందగా, వారిలో మొదటి డోస్ పొందిన వారు 32,449 మంది, రెండవడోస్ పొందిన వారు 4,301 మంది ఉన్నారన్నారు. ఉపాధ్యాయులు 63,109 మంది టీకాపొందగా, వారిలో మొదటి డోస్ పొందిన వారు 57,690 మంది, రెండవడోస్ పొందిన వారు 5,419 మంది ఉన్నారన్నారు. 18-44 సంవత్సరాలు వయస్సుకలిగిన చిన్నపిల్లల తల్లులు 1,84,754 మంది టీకాపొందగా, వారిలో మొదటిడోస్ పొందిన వారు 1,82,680 మంది, రెండవడోస్ పొందిన వారు 2,074 మంది ఉన్నారన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *