-తాగునీరు సమస్య పరిష్కరించండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోణా కష్ట కాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మేయర్ రాయన భాగ్య లక్ష్మి, వివిధ విభాగాల అధికారులతొ కలిసి మంత్రి నగరంలో పలు ప్రాంతాలు పర్యటించారు. 40వ డివిజన్లో బ్యాంకు సెంటరు నుంచి ప్రారంభమై పర్యటన కోళ్ళఫారం రోడ్డు, చర్చి రోడ్డు, గాంధీ బొమ్మ రోడ్డు తదితర ప్రాంతాలను పర్యటించారు. స్థానికులను సమస్యల అడిగి తెలుసుకున్నారు. నిర్ణయత సమయంలో తాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రాంతంలో ప్రయివేట్ స్థలంలో నివాసం ఉంటున్న 40 గజాల స్దలంలో నివాసం ఉంటున్నవారి సమస్య పరిష్కారానికి, ఇరుపక్షాల వారికి న్యాయం చేసేందుకు, వారి హాక్కు కల్పించే విషయంలో ఉన్న అంశాలను పరిశీలించాలని ఎమ్మెర్వోకు అదేశించారు. అదే విధంగా ఫించన్లు పంపిణిలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు పరిష్కారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చూడాలన్నారు.చంద్రబాబు నాయడు వ్యవస్థలను అడ్డంపెట్టుకుని ప్రభుత్వానికి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.. ప్రజలు మాత్రం వైసీపీతోనే ఉన్నారన్నారు అని అందుకు నిదర్శనమే వైసీపీ విజయలు అన్నారు.
ప్రజల వద్దకే పాలన : మేయర్
ప్రజలు వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో సంతోషంగా ఉన్నారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ప్రస్తుతం వరద కారణంగా ఇబ్బందులు లేకుండా ప్రజలకు శ్రుద్దమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు… జగనన్న సహకారంతో విజయవాడ అభివృద్ది పథంలో ముందకు సాగుతుందన్నారు. పర్యటనలో కార్పొరేటర్ శ్రీ యరడ్ల ఆంజనేయరెడ్డి, వైసీపీ శ్రేణులు తదితరులు ఉన్నారు.