-స్పందనలో అందిన అర్జీలను సత్వరం పరిష్కరించండి..
-సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో మంచి పురోగతి సాధించే దిశగా కృషి చేయాలని సంబంధితాధికారులకు విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్యసాయిప్రవీణ్ చంద్ చెప్పారు. స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయం నుంచి మంగళవారం మండల క్షేత్రస్థాయి అధికారులైన తహశీల్దార్లు, యంపిడిఓలు, హౌసింగ్ , వ్యవసాయ, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి కోవిడ్-19 ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్, ఇళ్లస్థలాల లేఅవుట్ల అభివృద్ధి, తదితర అంశాలపై సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరరీ, తదితర నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. డిజిటల్ లైబ్రరరీ, బల్క్ మిల్క్ థ్రిల్లింగ్ సెంటర్లు, తదితరాలకు భూమిలభ్యత, భూసేకరణ, స్పందన అర్జీల పరిష్కార తీరు తదితర అంశాలపై సమీక్షించారు. స్పందనలో అందిన అర్జీలను సత్వర పరిష్కారం చేయాలని సూచించారు. వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతి సాధించే విషయంపై తగు సూచనలు చేశారు. ఈసందర్భంగా మండల స్థాయి అధికారులచే లేవనెత్తిన అనేక సందేహాలను ఆయన నివృత్తి చేశారు. సమావేశంలో వైద్య, హౌసింగ్ , వ్యవసాయ, సర్వే, పౌరసరఫరాలు, తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.