విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బొండా ఉమా ఆదేశాల ప్రకారం దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ ఆరెస్ట్ ను ఖండిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టి యన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ అక్రమ మైనింగ్ తో లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న వైసీపీ నాయకుల తీరు ను ప్రశ్నించిన దేవినేని ఉమామహేశ్వర రావు పై దాడి అమానుషం. స్థానిక ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు మైనింగ్ ప్రాంతాన్ని దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. తాము చేస్తున్న అక్రమ మైనింగ్, భారీ ఎత్తున సాగుతున్న ప్రజాధన దోపిడీ వ్యవహారం బట్టబయలు అవుతుందనే భయంతో దేవినేని ఉమామహేశ్వర రావు పై అనాగరికంగా దాడి చేశారన్నారు.దేవినేని ఉమా మహేశ్వర రావు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్రం లో పోలీసు వ్యవస్థ అచేతన స్థితిలో ఉంది. వైసీపీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ, పోలీసులు తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించారు. దేవినేని ఉమామహేశ్వర రావు పై జరిగిన దాడి తీరును చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అసలు ప్రజాస్వామ్యం అమలు లో ఉందా? అన్న సందేహం కలుగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి, రాజ్యాంగ హక్కులకు రక్షణ కరువైంది. 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారంటే దాని అర్థం అందినకాడికి దోచుకోమని కాదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి. దేవినేని ఉమామహేశ్వర రావు పై దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. దేవినేని ఉమా పై పెట్టిన sc st అక్రమ కేసుల ను ఎత్తివేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువల ను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు, దాసరి జయరాజు, మధు, అంజి,దేవరాజ్, సత్యం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …