Breaking News

ప్రతి అధికారి, ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…    

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రజలకు మేలు చేకూరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్థాయి , ద్వితీయ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు, నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తిచేయాలని అన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు . సంబంధిత శాఖలకు హెడ్ ఆఫీసు నుండి వచ్చి న ఆదేశాలను ఎప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్ దృష్టికి తేవాలన్నారు. సమావేశాలకు నిర్దేశించిన సమయానికి హాజరు అవ్వడమేకాకుండా, ముందస్తుగా పూర్తి స్థాయిలో సిద్ధం కావాలన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ప్రధాన కార్యస్థానంను విడిచి వెళ్లకూడదని ఆయన ఆదేశించారు. ప్రతి అధికారి, ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన యాప్ లను వినియోగించుకోవడంలో పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి శాఖలో ఉన్న గ్రీవెన్సకు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలన్నారు. ఆయా శాఖల కు సంబంధించిన అధికారులు ప్రతి సోమవారం వారి శాఖ పనితీరు పై సమీక్షించాలి అన్నారు. గ్రామ / వార్డ్ సచివాలయాల పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించాలని , గ్రామ వార్డు సచివాలయాలను అధికారులు తనిఖీలు చేయాలని ఆయన సూచించారు. ఫైలు వ్రాసేటప్పుడు క్వాలిటీ నోట్ ఉండాలని, సరళమైన భాషలో లో క్వాలిటీ గా ఫైల్ రూపొందించి సమర్పించలన్నారు. హెడ్ ఆఫీసు తో ఎప్పటికప్పుడు సంబంధాలు కలిగి ఉండాలని అని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి)  హిమాన్షు శుక్లా ,జయింట్ కలెక్టర్ (రెవెన్యూ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , జాయింట్ కలెక్టర్( గృహ నిర్మాణం)  సూరజ్ ధనుంజయ్ , ఐ టీ డీ ఏ పి ఓ  ఆనంద్ , నరసాపురం సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ , జయింట్ కలెక్టర్ ( వెల్ఫేర్)  పద్మావతి , జిల్లా రెవెన్యూ అధికారి డేవిడ్ రాజు , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *