విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బావాజీ పేట పరిసర ప్రాంత ప్రజలకు 196 సచివాలయం పరిధిలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉండాలని కృష్ణ జిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు కోవిడ్ కట్టడిలో భాగంగా పట్టణంలో ప్రతి వారం ఇంటింటికీ సచివాలయ సిబ్బంది, వాలెంటర్లు, ఆశా వర్కులు, హెల్త్ సిబ్బంది పక్కాగా ఫీపర్ సర్వేను గురువారం నమోదు చేపట్టారు. దీనిలో భాగంగా బావాజీ పేట, రామకోటి మైదానం తదితర సమీప ప్రాంతాలలో ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 196 సచివాలయం అడ్మిన్ సెక్రెటరీ ప్రవీణ్ మాట్లాడుతూ ఫీవర్ సర్వే నిర్వహించడం వలన కోవిడ్ నియంత్రణ సాధ్యమవుతుందని ప్రజల కూడా సర్వే టీమ్ లకు సహకరించాలన్నారు. కోవిడ్ 3వ దశను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ రోగలక్షణాలు, పాజిటివ్ కేసులను ముందుగా గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో క్రమంతప్పకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఏ ఇంటిలో నైనా అనారోగ్యము లక్షణం కలవారు ఎవరైనా ఉంటే తక్షణం సమీపంలోని సచివాలయంలో గాని, హెల్త్ ఏఎన్ఎం సిబ్బందిని కానీ వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని కోరారు. కరోనా వైరస్ నుండి రక్షణకు వ్యాక్సినే మార్గమని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని సుక్షితంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్ మధుకర్, ఇంజనీరింగ్ కార్యదర్శి బి.నిహాంత్ కుమార్, నగర పాలక సంస్థ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …