Breaking News

ఘనంగా అవతార్ మెహెర్ బాబా జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవతార్ మెహెర్ బాబా 131వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా విజయవాడ, సత్యనారాయణపురం అవతార్ మెహెర్ బాబా ఆలయ ప్రాగణంలో ఫిబ్రవరి 4వ నుండి ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ప్రతి రోజు సా. 6 గం.ల నుండి రా.8.00 గం.ల వరకు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకలలో చివరి రోజు అయిన ఫిబ్రవరి 25 వ తేదీన అవతార్ మెహెర్ బాబా 131 వ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి సంకీర్తనలు, 5 గంటలకు బాబా జన్మించిన సమయమున బాబా కు హారతి, కేక్ కటింగ్, జి. సుబ్బలక్ష్మి బాబా సత్యప్రేమ సందేశం, ఉదయం 7 గం. ల కు కేంద్ర అధ్యక్షులు డా. మెహెర్ ప్రసన్న సప్త వర్ణ పతాక ఆవిష్కరణ అనంతరము బాబా స్వయంగా ఇచ్చిన పాదుకులకు ప్రేమికుల చేత పాద పూజ కార్యక్రమం, 11.00 గంటలకు అన్నప్రసాద వితరణ, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి భజనలు, బాబా ఫిల్మ్ షో ప్రదర్శనతో జన్మదినోత్సవ వేడుకలు బాబా ప్రేమా ఆశీస్సులతో ఘనంగా జరిగాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *