-రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అమలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జిల్లాలో ఆగష్టు 14 వరకూ రాత్రి కర్ఫ్యూనూ పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 14 వరకూ ప్రతీరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా ఇతర సేవలకు అనుమతి లేదన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా గతంలో జారీ చేసిన ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. జనరద్దీని నియంత్రించేందుకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.