విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు కటికి రాకేష్ నాథ్ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, భానునాగర్, శ్రీనగర్ కాలనీ, గులాబితోట లో కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, 45 వయస్సు పైబడిన 2000 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ జరిగింది. ఈ సంధర్భంగా చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు లకనం శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి అభిమానులను కలుపుకొని అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవికృష్ణాకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారన్నారు. అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు కటికి రాకేష్ నాథ్ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రాంతాలలో బొనిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ చేయడం హర్షణీయం అన్నారు. గొలగాని రవి కృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలు ద్వారా ఎంతో మంది పేద, బడుగు బలహీన వర్గాల వారికి లబ్ది చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ జనసేన నాయకురాలు లక్ష్మి అపర్ణ, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఇల్లురి సుగుణబాబు, విజయవాడ చిరంజీవి యువత ఉపాధ్యక్షులు తోట కోటి, విజయవాడ చిరంజీవి యువత సభ్యులు దుక్కా వేణు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా …